Elon Musk-Bernard Arnault Lunch Meet : ఫ్యామిలీలతో పారిస్‌లో మీట్ అయిన ప్రపంచ కుబేరులు

వారిద్దరు ప్రపంచ కుబేరులు. సంపదలో నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటారు.వారిద్దరు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది. ప్రపంచ కుబేరులిద్దరు లంచ్ మీట్ పై ప్రపంచ వ్యాపారా దిగ్గజాలు ఆసక్తిగా గమనించాయి.

Elon Musk-Bernard Arnault Lunch Meet : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ ఉంటుంది ఆ ఇద్దరి మధ్యా. వారిద్దరు ఓ చోట కలిసారు. చక్కగా నవ్వుకుంటూ ముచ్చటించుకున్నారు. కలిసి లంచ్ చేశారు. వ్యాపారంలో ఎవరి టాలెంట్ వారిది..ఎవరి సత్తా వారిది..కానీ అటువంటివారిద్దరు ఒకచోట కలిస్తే సంచలనం కాకుండా ఉంటుందా? వైరల్ కాకుండా ఉంటుందా..? అదే అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ‘నంబర్ వన్’ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతున్న క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు. పైగా ఫ్యామిలీలతో కలిసి..వారే టెస్లా అధినేత (Tesla CEO)ద గ్రేట్ ఎలన్ మస్క్ (Elon Musk), ఫ్రెంచ్ వ్యాపారవేత్త, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ (Chairman and CEO of LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్..(Bernard Arnault)..!

వారిద్దరు ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఫ్యామిలీలతో కలిసారు. చక్కగా ముచ్చటించుకున్నారు. కలిసి లంచ్ (lunch meeting)చేశారు. మస్క్ (Elon Musk),బెర్నార్డ్ ఆర్నాల్డ్ (Elon Musk)సంపదలో స్వల్ప తేడా ఉంటుంది. ఇద్దరు ప్రపంచ కుబేరుల స్థానంలో నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటారు. సాధారణంగా వ్యాపారస్తుల మధ్య పోటీ సర్వసాధారణమే. అలా ఉంటేనే వారి వారి ప్రతిభా పెరుగుతుంటుంది.వారి మధ్య వ్యాపారం పోటీ మాత్రం కొనసాగుతుంటుంది. వ్యాపారాల డెవలప్ మెంట్ లో భారీ పోటీ ఉన్నా..అటువంటివారు ఎక్కడన్నా కలిస్తే స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారటనాకి వీరిద్దరి కలయిక ఒక ఉదాహరణగా చెప్పొచ్చు..

Elon Musk Viral Pics : భారతీయ వరుడు వస్త్రధారణతో ఎలన్ మస్క్..!

అలా ప్యారిస్ (Paris)లో శుక్రవారం (జూన్ 16,2023)కుటుంబ సభ్యులతో సహా కలిసారు బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలన్ మస్క్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రపంచ వ్యాపార వర్గాల్లో ఓ సంచలనంగా మారింది వీరి ‘లంచ్ మీట్’..(Lunch Meet)మీట్ లో మస్క్ తల్లి మాయో మస్క్ (Maye Musk)తో రాగా..ఆర్నాల్డ్ తో పాటు అతని ఇద్దరు కుమారులు ఆంటోయిన్(Antoine), అలెగ్జాండ్రే ఆరనాల్డ్ (Antoine Arnault)ఉన్నారు. ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరుగుతున్న వివా టెక్నాలజీ సదస్సు ( Viva Technology event)7వ ఎడిషన్‌కు ఆర్నాల్ట్, మస్క్ హాజరయ్యారు. ఈ సందర‍్భంగా వీరు ఫ్యామిలీలతో సహా శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు.

వీరిద్దరి కలయిక గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (French President Emmanuel Macron) స్పందించారు. ‘‘కలిసి పని చేద్దాం!..(#ChooseFrance.”) ఫ్రాన్స్ ను ఎంచుకోండి’’ అంటూ మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్‌ చేశారు.

Cat Job In Airport : ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో పిల్లికి ఉద్యోగం .. క్యాప్,యూనిఫాం ధరించి ఏం చేస్తుందో తెలుసా..?!

ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 236.9 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నంబర్ వన్ స్థానాన్ని పోగొట్టుకున్నా..తిరిగి ఇటీవలే దక్కించుకున్నారు. ఇక బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 233.4 బిలియన్‌ డాలర్లు. ఇటీవల వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆయన తన కంపెనీ షేర్లు పడిపోవడంతో రెండో స్థానంలోకి వచ్చారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు