డ్రైనేజీలో పడిపోయిన బాలుడు.. 3 రోజుల తర్వాత అతడి మృతదేహం ఎలా దొరికిందో తెలుసా?

ఓ బాలుడు తన తండ్రి హీరాలాల్ తో కలిసి జ్యోతినగర్ ప్రాంతంలో బైకుపై వెళ్తుండగా వర్షం..

డ్రైనేజీలో పడిపోయిన ఎనిమిదేళ్ల ఓ బాలుడి మృతదేహం మూడు రోజుల తర్వాత లభ్యమైంది. అసోంలోని గౌహతిలో ఓ బాలుడు తన తండ్రి హీరాలాల్ తో కలిసి జ్యోతినగర్ ప్రాంతంలో బైకుపై వెళ్తుండగా వర్షం పడింది. అదే సమయంలో ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడి ఆ బాలుడు కొట్టుకుపోయాడు.

అతడి కోసం ఆ తండ్రి డ్రైనేజీలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అధికారులకు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మూడు రోజులుగా బాలుడిని వెతికారు. చివరకు డ్రైనేజీలో ఓ బాలుడి మృతదేహం లభ్యం కావడంతో దాన్ని గౌహతి మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ మృతదేహం తమ కుమారుడిదేనని అతడి తల్లిదండ్రులు గుర్తించారు.

డ్రైనేజీలో ఆ బాలుడిని గుర్తించడానికి అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. స్నిఫర్ డాగ్‌లు, ఎక్స్‌కవేటర్‌లు, ఇతర పరికరాలను వాడారు. ఆ బాలుడి మృతదేహం రాజ్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైందని అధికారులు తెలిపారు. ఆ బాలుడి మృతి పట్ల అసోం సీఎం బిశ్వశర్మ సంతాపం తెలిపారు. ఆ బాలుడు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.

Also Read: ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..