Tollywood Debut Heroins : 2021 టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చిన భామలు

ఈ సంవత్సరం టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చి, మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించిన టాప్ హీరోయిన్స్ వీళ్ళే..

Tollywood Debut Heroins :    ప్రతి సంవత్సరం మన ఇండస్ట్రీలో కొత్త సినిమాలు చాలానే వస్తాయి. కొత్త సినిమాలతో పాటు కొత్త ఆర్టిస్టులు కూడా చాలా మంది వెండితెరపై మెరుస్తారు. ఇక మన టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం చాలా మంది కొత్త హీరోయిన్స్ వస్తారు. దేశంలో ఎక్కడ ఉన్నా అందం, ట్యాలెంట్ ఉంటె మన తెలుగులో ఎంట్రీ ఖాయం. అలా చాలా మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

Book My Show : BookMyShowలో 2021లో అత్యధికంగా బుక్ చేయబడిన టాప్ 10 సినిమాలు ఇవే…

ఈ సంవత్సరం టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చి, మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించిన టాప్ హీరోయిన్స్ వీళ్ళే..

ఈ లిస్ట్ లో కచ్చితంగా మొదట కృతిశెట్టి పేరే ఉంటుంది. మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది కృతి. ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు సంపాదిస్తూ రెమ్యునరేషన్ ని కూడా పెంచేసింది. కృతికి ఇప్పుడు దాదాపు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి.

ఇక ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ తెలుగు తెరకి పరిచయమయింది. తన అందాలతో కుర్రకారుని మత్తెక్కించింది. కేతిక మొదటి సినిమాలోనే వీర లెవెల్లో రొమాన్స్ చేసింది. కేతిక కూడా ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలని పట్టేసింది.

రాఘవేంద్రరావు సినిమాతో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా ‘పెళ్లి సందD’. 25 ఏళ్ళ క్రితం వచ్చి భారీ విజయం సాధించిన ‘పెళ్లి సందడి’ సినిమాకి అప్ డేటెడ్ వర్షన్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమానే రాఘవేంద్రరావు కాంపౌండ్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

ఈ సంవత్సరం కృతిశెట్టి తర్వాత ఎక్కువ పేరు తెచ్చుకుంది మాత్రం ‘జాతి రత్నాలు’ సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లానే. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఈమె కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. తన స్మైల్ కి, తన యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత మెయిన్ లీడ్ లో అవకాశాలు రాకపోయినా వేరే క్యారెక్టర్స్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. త్వరలో ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి ఐటెం సాంగ్ లో ఆడి పాడనుంది ఈ భామ.

సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకి పరిచయమైంది.

హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు సంపాదించింది.

క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన ‘నాట్యం’ సినిమాతో సంధ్య రాజు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాలో తన నటనతో పాటు తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది సంధ్య రాజు.

గతంలోనే ‘లవర్స్ డే’ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయం అయినా నితిన్ హీరోగా నటించిన ‘చెక్’ సినిమాతో డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్.

ప్రముఖ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ సినిమాతో కాశిష్ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లో.

ట్రెండింగ్ వార్తలు