2024 Elections: కాంగ్రెస్‭కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఆప్ వ్యవహారం అటు ఇటుగా ఇలాగే ఉంది

సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు

Opposition Meet: విపక్షాల మెగా సమావేశంలో పాల్గొన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ వ్యవహారం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేనట్టు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారం నాటి మీటింగుకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా అనే అనుమానాలు సైతం వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయనతో పాటు పంజాబ్ సీఎం, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. కానీ సమావేశం అనంతరం మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు.

Opposition Meet: తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకే ప్రతిపక్షాలు.. పాట్నా మెగా మీటింగ్‭లో ఏం జరిగింది?

ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో ఆప్ విబేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై చేసిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ఆ పార్టీ ఇలాగే వ్యవహరించింది. ఒకపక్క విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ చర్చలు చేస్తుంటే.. ఇదే సమయంలో కేంద్రం ఆర్డినెన్సుపై కాంగ్రెస్ పార్టీపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ, భాజపా ఒప్పందం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Opposition Meet: అంత చర్చా చేసి రాహుల్ గాంధీని పెళ్లికి ఒప్పించారట.. విపక్షాల మీటింగ్‭పై బీజేపీ షార్ప్ అటాక్

ఇక సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. కేంద్రం ఆర్డెనెన్స్ గురించి స్పందిస్తూ ‘‘కేంద్రం ఆర్డినెన్సుపై రాజ్యసభలో జరిగే ఓటింగుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చని వ్యక్తిగత చర్చలలో కొంతమంది సీనియర్ నాయకులు అన్నారు. ఈ అంశంపై ఓటింగ్‌కు కాంగ్రెస్ గైర్హాజరు కావడం, భారత ప్రజాస్వామ్యంపై దాడిని మరింతగా పెంచడంలో బీజేపీకి ఎంతగానో దోహదపడుతోంది’’ అని అన్నారు.

2024 Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. అప్పుడే సీట్ల పంపకానికి పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

పాట్నా సమావేశంలో సైతం కేంద్రం తీసుకువచ్చిన బ్లాక్-ఆర్డినెన్స్ మీద తమ అభిప్రాయం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం మౌనమే సమాధానంగా వ్యవహరించింది. దీన్ని కేజ్రీవాల్ తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్.. ప్రతి అంశంపై తమ ఉద్దేశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. బ్లాక్ ఆర్డినెన్స్ మీద తమ వైఖరేంటో చెప్పకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ విభాగం బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇలాంటి పార్టీతో ఎలాంటి పొత్తైనా క్లిష్టంగానే ఉంటుంది’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు