Acharya: ఎట్టకేలకు ఆచార్య వస్తున్నాడోచ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య....

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఉన్నారు.

Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

అయితే ఈ సినిమాను గతేడాదిలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా, కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. దీంతో ఆచార్య చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఉగారి పండగ సందర్భంగా ఆచార్య చిత్రం నుండి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. వారు అనుకున్నట్లుగానే ఆచార్య చిత్రం నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు

ఆచార్య చిత్ర ట్రైలర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియో ద్వారా ప్రకటించింది. చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను కొరటాల శివ తనదైన మార్క్ చిత్రంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఆచార్య ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు