మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాపై సస్పెన్స్‌ వీడిపోనుందా?

ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టిన రోజు పురస్కరించుకుని...

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో నిర్మించనున్న చిత్రంపై సస్పెన్స్‌ వీడిపోనుందా? పాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో తెరకెక్కించున్న ఈ సినిమాపై జక్కన్న చెక్కడాలు అన్నీ పూర్తయ్యాయా? మహేశ్‌ లుక్‌తోపాటు సినిమా కథపై వస్తున్న ఊహాగానాలకు తెరదించే సమయం ఆసన్నమైందా? ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు సినిమా తాజా అప్‌డేట్‌ ఏంటి?

తెలుగుతోపాటు అన్ని చిత్రపరిశ్రమల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు, రాజమౌళి మూవీపై ఇంపార్టెంట్‌ అప్డేట్‌ ఇది… ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీపై క్లారిటీ ఇచ్చేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారట… ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ కావడంతో సినిమా షెడ్యూల్‌ ప్రారంభంపై ప్రకటన చేయాలని దర్శకుడు రాజమౌళి నిర్ణయించారని తాజా సమాచారం. ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టిన రోజు పురస్కరించుకుని… ఈ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీపై ఫుల్‌ అప్డేట్‌ ఇవ్వనున్నారనటి టాలీవుడ్‌ టాక్‌.

జక్కన్న ఏం చెబుతారు?
ఇప్పటివరకు ఈ సినిమాలో కథానాయకుడు మహేశ్‌ తప్ప, మిగిలిన నటీనటులు ఎవరో… అధికారికంగా చెప్పలేదు. ఈ క్రమంలోనే ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు జరుపుకోనుండటంతో మూవీ అప్‌డేట్‌ ఇవ్వాలని జక్కన్న భావిస్తున్నట్లు టాలీవుడ్‌ సమాచారం. దీంతో జక్కన్న ఏం చెబుతారా? అని మహేశ్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహేశ్‌ బయటకు వచ్చే సమయంలో పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్‌ పెట్టుకుని కనిపించారు. కొత్త సినిమా పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. సరికొత్త లుక్‌లో కనపడనున్నట్లు తెలుస్తోంది. మహేశ్ హైదరాబాద్‌ చేరుకోవడంతో అందరూ కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేశ్‌ పుట్టినరోజు కానుకగా సినిమాకు సంబంధించి ఏదైనా ప్రీవిజువల్‌ టీజర్‌ ఉంటుందా? లేక మహేశ్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ వస్తుందా?  చూడాలి

Also Read: భారత్‌లో అత్యంత వేగంగా రూ.500 కోట్లు రాబట్టిన సినిమాగా ‘కల్కి’.. టాప్-5 సినిమాలు ఇవే..