భారత్‌లో అత్యంత వేగంగా రూ.500 కోట్లు రాబట్టిన సినిమాగా ‘కల్కి’.. టాప్-5 సినిమాలు ఇవే..

జూన్ 7న (ఆదివారం) ఈ సినిమా హిందీలో రూ.22 కోట్లు, తెలుగులో రూ.14 కోట్లు..

భారత్‌లో అత్యంత వేగంగా రూ.500 కోట్లు రాబట్టిన సినిమాగా ‘కల్కి’.. టాప్-5 సినిమాలు ఇవే..

Kalki

భారత్‌లో 11 రోజుల్లో రూ.500 కోట్లు రాబట్టింది ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. దీంతో భారత్‌లో అత్యంత వేగంగా రూ.500 కోట్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇంతకు ముందు వరకు ఈ జాబితాలో షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమా అగ్రస్థానంలో ఉంది. జవాన్ సినిమా 18 రోజుల్లో రూ.500 కోట్ల మార్కును దాటింది.

ఏ సినిమాకు ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు

  • కల్కి 2898 ఏడీ – 11 రోజుల్లో రూ.510 కోట్లు
  • జవాన్ – 18 రోజుల్లో రూ.582 కోట్లు
  • గదర్ 2 – 24 రోజుల్లో రూ.526 కోట్లు
  • పఠాన్ – 28 రోజుల్లో రూ.525 కోట్లు
  • బాహుబలి 2 – 34 రోజుల్లో రూ.511 కోట్లు
  • యానిమల్ – 39 రోజుల్లో రూ.503 కోట్లు

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 7న (ఆదివారం) ఈ సినిమా హిందీలో రూ.22 కోట్లు, తెలుగులో రూ.14 కోట్లు, తమిళంలో రూ.3 కోట్లు, మలయాళంలో రూ.1.8 కోట్లు, కన్నడలో రూ.0.5 కోట్లు రాబట్టింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కల్కి సినిమా 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు ఆ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read : కల్కి అప్పుడే 900 కోట్లు.. వెయ్యి కోట్ల చేరువలో.. అన్ని చోట్ల ప్రాఫిట్స్‌తో దూసుకుపోతూ..