Pragathi : ‘ఊ అంటావా మావా’.. ప్రగతి డ్యాన్స్ అరుపులు అంతే!

‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ సాంగ్‌కి ప్రగతి స్టెప్స్ చూశారా?..

Pragathi: నటి ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. అదేంటి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా. షేక్ చేయడం లాంటి మాస్ పదాలు ఆమెకు అన్వయిస్తారేంటి అనుకోకండి.

Pragathi Dance : మెగాస్టార్ సాంగ్‌కి ప్రగతి మాస్ మూమెంట్స్ మాములుగా లేవుగా!..

ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.. షూటింగ్ అప్‌‌డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి.. ఒక్కసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే.. ఎవరైనా ఈ విషయం ఒప్పుకుని తీరుతారు..

Pragathi : క్యాట్‌వా‌క్‌తో కవ్విస్తున్న ప్రగతి

రీసెంట్‌గా ప్రగతి డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ లో హాట్ బ్యూటీ సమంత చేసిన ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో తెలిసిందే. ఆ పాటకు తన స్టైల్లో కిరాక్ స్టెప్పులేసింది ప్రగతి. ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ గురించైతే చెప్పక్కర్లేదు. ఇంకెందుకాలస్యం? చూసెయ్యండి మరి..

ట్రెండింగ్ వార్తలు