Anand Deverakonda : బాబోయ్.. సిక్స్ ప్యాక్ చేసిన ఆనంద్ దేవరకొండ.. బాడీ అదిరిందిగా..

ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియాలో సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోని షేర్ చేశాడు.

Anand Deverakonda Shares his Six Pack Body Photo Trained up for Gam Gam Ganesha Movie

Anand Deverakonda : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదట్నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇటీవలే బేబీ(Baby) సినిమాతో 100 కోట్ల భారీ హిట్ కొట్టాడు. త్వరలో ఆనంద్ దేవరకొండ ‘గం..గం..గణేశా’ సినిమాతో రాబోతున్నాడు. ఆనంద్ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ గం..గం..గణేశా(Gam Gam Ganesha) సినిమా తెరకెక్కుతుంది.

Also Read :Lady Anchors : సుమతో సహా అయిదుగురు మహిళా యాంకర్లు ఒకే స్టేజిపై.. సందడే సందడి..

గం..గం..గణేశా సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే మే 20న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అని, నిజంగా కండలు పెంచాను అంటూ తన సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోని షేర్ చేశాడు.

ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియాలో సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోని షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు బాడీ అదిరిందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. గం..గం..గణేశా సినిమాలో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, దానికోసమే ఈ సిక్స్ ప్యాక్ బాడీ తయారుచేసినట్టు తెలిపాడు ఆనంద్. దీంతో ఆనంద్ సినిమా కోసం, సిక్స్ ప్యాక్ చేయడానికి చాలా కష్టపడి ఉంటాడని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.