Lady Anchors : సుమతో సహా అయిదుగురు మహిళా యాంకర్లు ఒకే స్టేజిపై.. సందడే సందడి..
గాయత్రీ భార్గవి, శిల్ప చక్రవర్తి, గీతా భగత్, వింధ్య.. నలుగురు యాంకర్లు సుమ అడ్డా షోకి వచ్చి యాంకర్ సుమతో కలిసి సందడి చేసారు.

Female Anchors Gayathri Bhargavi Vindhya Geetha Bhagat Shilpa came to Suma Adda Show
Lady Anchors : యాంకర్ సుమ(Suma) ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని తన యాంకరింగ్ తో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుమ అడ్డా అనే ఓ ప్రోగ్రాంలో యాంకర్ గా చేస్తుంది సుమ. ప్రతివారం పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు వచ్చి ఈ షోలో సందడి చేస్తారు. తాజాగా ఈ షోకి నలుగురు మహిళా యాంకర్లు వచ్చారు. గాయత్రీ భార్గవి, శిల్ప చక్రవర్తి, గీతా భగత్, వింధ్య.. నలుగురు యాంకర్లు సుమ అడ్డా షోకి వచ్చి యాంకర్ సుమతో కలిసి సందడి చేసారు.
గాయత్రీ భార్గవి ప్రస్తుతం నటిగా కూడా సినిమాల్లో బిజీగా ఉంది. గతంలో పలు ప్రోగ్రామ్స్ తో మెప్పించిన గాయత్రీ ప్రస్తుతం అధికారిక, సాంప్రదాయ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. ఇక శిల్ప చక్రవర్తి కూడా గతంలో పలు టీవీ షోలు, ఈవెంట్స్ తో మెప్పించింది. ఇపుడు కూడా పలు షోలు, సినిమాలు చేస్తుంది. గీతా భగత్ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంది. ఇక వింధ్య విశాఖ అయితే స్పోర్ట్స్ యాంకర్ గా ఫుల్ బిజీ అయింది. ఈ నలుగురు సుమ అడ్డా షోకి రాగా తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
Also Read : Narendra Modi : నరేంద్ర మోదీ బయోపిక్.. మోదీ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?
షోలో ఈ నలుగురు యాంకర్లు కలిసి సుమతో ఫుల్ కామెడీ చేసారు. ఒక్క యాంకర్ ఉంటేనే జోష్ మాములుగా ఉండదు. అలాంటిది ఒకే షోలో నలుగురు మహిళా యాంకర్లు ఉంటే ఇక ఆ షోలో కామెడీ ఎంత ఉంటుందో ఊహించేయొచ్చు. ప్రోమోలోనే వీరి సందడి అంతా కనిపిస్తుంది. దీంతో ఈ ప్రోమో వైరల్ అవ్వగా ఫుల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.