Narendra Modi : నరేంద్ర మోదీ బయోపిక్.. మోదీ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?
తాజాగా సౌత్ లో కూడా త్వరలో నరేంద్ర మోదీ బయోపిక్ రానుందని తెలుస్తుంది.

Narendra Modi
Narendra Modi : ఇటీవల సినీ పరిశ్రమలో చాలా బయోపిక్స్ వస్తున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 2019లో ఓ సినిమా వచ్చింది. మరో సినిమా కూడా బాలీవుడ్ లో మోదీ పై తెరకెక్కుతోందని సమాచారం. తాజాగా సౌత్ లో కూడా త్వరలో నరేంద్ర మోదీ బయోపిక్ రానుందని తెలుస్తుంది.
తమిళ్ నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్(Sathyaraj) నరేంద్ర మోదీ బయోపిక్ లో మోదీ పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. సత్యరాజ్ కొంచెం గడ్డం పెంచితే మోదీ లుక్ లోకి తీసుకురావొచ్చు. అందుకే మేకర్స్ సత్యరాజ్ ని మోదీ పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఈ బయోపిక్ ప్రకటన రాలేదు. కొన్ని తమిళ, నేషనల్ మీడియా కథనాల ప్రకారం సత్యరాజ్ మోదీ పాత్రలో నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు సమాచారం.
Also Read : Lavanya Tripathi : ప్రకృతిలో కట్టెల పొయ్యి వెలిగించి టీ పెట్టుకుంటున్న మెగా కోడలు లావణ్య..
మరి ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఇందులో నరేంద్ర మోదీ జీవితం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూపించబోతున్నారు.. ఇలా మరిన్ని వివరాలు తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.