Lavanya Tripathi Shares Enjoying Vacation Photos goes Viral
Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా కోడలు అయ్యాక మరింత వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంది లావణ్య. లావణ్య ఏ పోస్ట్ చేసినా మెగా కోడలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత నుంచి లావణ్య, వరుణ్ తేజ్ రెగ్యులర్ గా ట్రిప్స్ వేస్తున్నారు.
ఇటీవల కూడా లావణ్య, వరుణ్, తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రకృతి ప్రదేశానికి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. వెకేషన్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వెకేషన్ లో అక్కడ దొరికిన రాళ్లు, పుల్లలతో స్టవ్ తయారుచేసుకొని తీసుకెళ్లిన పదార్థాలతో అక్కడే టీ పెట్టుకొని తాగుతుంది లావణ్య. ప్రకృతిలో లావణ్య టీ పెడుతున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారగా వెకేషన్ కి మళ్ళీ ఎక్కడికి వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.