Jabardasth Pavithraa : ప్రాణాలతో బయటపడ్డాను అంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటి.. యాక్సిడెంట్‌లో తుక్కు తుక్కు అయిన కార్..

తాజాగా పవిత్ర తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

Jabardasth Pavithraa : ప్రాణాలతో బయటపడ్డాను అంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటి.. యాక్సిడెంట్‌లో తుక్కు తుక్కు అయిన కార్..

Jabardasth Pavithraa Shares a Emotional Video about her Accident

Jabardasth Pavithraa : ఇటీవల యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేలపై యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా యాక్సిడెంట్స్ కి గురవుతున్నారు. ఇటీవలే సీరియల్ నటి పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ లో మరణించింది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ పవిత్ర.. తనకు యాక్సిడెంట్ జరిగింది, కార్ నాశనమైంది, ప్రాణాలతో బయటపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంటర్ అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగానే ఉంది. ఇక యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. పవిత్ర ఇటీవల ఎన్నికల ముందు మే 11న ఓటు వేసేందుకు తమ సొంత ఊరు సోమశిల వెళ్తున్నప్పుడు నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే మరో కార్ వీళ్ళ కార్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్రకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. పవిత్రతో పాటు ఉన్న ఆమె బంధువులకు కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో కార్ మాత్రం తుక్కుతుక్కు అయింది.

Also Read : Kalki 2898AD Update : ప్రభాస్ ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. ‘కల్కి’ అప్డేట్ వచ్చేసింది..

తాజాగా పవిత్ర తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ.. ఎన్నికలకు ఊరు వెళ్తుండగా తనకు యాక్సిడెంట్ జరిగిందని, తను, తన పిన్ని, వాళ్ళ పిల్లలు అందరు ప్రాణాలతో బయటపడ్డామని, తలుచుకుంటేనే భయమేస్తుందని తెలిపింది. అలాగే తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కార్ ఇలా నాశనమైపోయింది అంటూ ఎమోషనల్ అయింది. అసలు మేము బతికొస్తామో లేదో అనుకున్నాము, ప్రస్తుతం అందరం సేఫ్ గానే ఉన్నాము అంటూ తెలిపింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.