Chandini Chowdary : ‘సంతాన ప్రాప్తిరస్తు’ అంటున్న చాందిని చౌదరి.. వరుస కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతుందిగా..

తెలుగమ్మాయి చాందిని చౌద‌రి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్‌గా ఎదిగింది.

Title poster of Chandini Chowdary Santhana Prapthirasthu launched

Chandini Chowdary – SanthanaPrapthirasthu : తెలుగమ్మాయి చాందిని చౌద‌రి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్‌గా ఎదిగింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న సినిమాల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే విమ‌ర్శ‌ల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటోంది. ఇటీవ‌లే ‘గామి’ మూవీతో మంచి హిట్ అందుకుంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘యేవమ్’ చిత్రాల్లో న‌టిస్తోంది.

ఈ రెండు సినిమాలే కాకుండా మ‌రో సినిమాను అంగీక‌రించింది చాందిని. ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ మూవీకి సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కుడు. విక్రాంత్ రెడ్డి లీడ్ రోల్ పోషిస్తుండ‌గా మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి లు నిర్మిస్తున్నారు.

Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నుంచి.. క్యూట్ గా స్వీట్ గా అంటూ బాధపడుతున్న చైతన్యరావు..

శ‌నివారం నిర్మాత‌లు చిత్ర టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ.. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో చూపించ‌నున్న‌ట్లు చెప్పారు.