Bellamkonda Srinivas: ఇండస్ట్రీలో ఎవరి స్వార్ధం వాళ్లదే.. స్వచ్ఛమైన స్నేహం దొరకడం కష్టం.. అందుకే ఇలా!
నేను ఏదైనా మొహం మీదే మాట్లాడతాను(Bellamkonda Srinivas). ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడం నాకు రాదు. ఇబ్బంది కలిగితే వాళ్ళ ముందే చెప్పేస్తాను.

Young hero Bellamkonda Srinivas' interesting comments on Tollywood
Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందాపురి. దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈనేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas).
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ గురించి, అందులోని మనుషుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నేను ఏదైనా మొహం మీదే సూటిగా మాట్లాడతాను. ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడం నాకు రాదు. ఎవరివల్ల అయినా ఇబ్బంది కలిగితే వాళ్ళ ముందే చెప్పేస్తాను. నేను తప్పు చేసినా వెంటనే అంగీకరిస్తాను. దాంతో అందరు నాకు యాటిట్యూడ్ అనుకుంటారు.
నిజానికి భైరవం మూవీ రిలీజ్ ముందు వరకు కాస్త తక్కువగా మాట్లాడేవాని. కానీ, ఇప్పుడు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నాను. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. లోతు ఎంత అనేది దిగిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఎవరి స్వార్ధం వాళ్ళది. మనముందు ఒకలా వెనకాల ఇంకోలా మాట్లాడతారు. అందుకే ఇక్కడ స్వచ్ఛమైన స్నేహం దొరకడం కష్టం. నేను ఎవరి గురించి మాట్లాడను, గాసిప్స్ కూడా వినను. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అంటున్నారు. కానీ, మంచి సినిమా ఇస్తే తప్పకుండా వస్తారు. కిష్కిందాపురి ఆలాంటి సినిమా అవుతుందని నమ్మతున్నాం”అంటూ చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.