Bads Of Bollywood: షారుక్ కొడుకు ఫస్ట్ మూవీ.. ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. రాజమౌళి కూడా ఉన్నాడు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న వెబ్ సిరీస్(Bads Of Bollywood) 'బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్'.

Bads Of Bollywood: షారుక్ కొడుకు ఫస్ట్ మూవీ.. ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. రాజమౌళి కూడా ఉన్నాడు

Aryan Khan's Bads of Bollywood web series trailer released

Updated On : September 8, 2025 / 4:11 PM IST

Bads Of Bollywood: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’. హిందీ చిత్ర పరిశ్రమపై రూపొందించిన ఈ సిరీస్‌ ఈ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌(Bads Of Bollywood) ట్రైలర్‌ ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ట్రేలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Navya Nair: మల్లెపూలు తెచ్చినందుకు లక్ష ఫైన్.. కంగుతిన్న మలయాళ నటి నవ్య

ఇక్కడ మరో విశేషం ఏంటంటే, టాలీవుడ్ నుండి దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సిరీస్ లో స్పెషల్ రోల్ ప్లే చేశారు. అలాగే షారుక్‌, అమీర్ ఖాన్, దిశా పటానీ కూడా ఈ సిరీస్లో స్పెషల్ రోల్ చేశారు. దీంతో ఈ సిరీస్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి, షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చేస్తున్న మొదటి సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 18వరకు ఆగాల్సిందే.