Navya Nair: మల్లెపూలు తెచ్చినందుకు లక్ష ఫైన్.. కంగుతిన్న మలయాళ నటి నవ్య

మలయాళ బ్యూటీ నవ్య నాయర్ కు ఆస్ట్రేలియన్ పోలీసుకు షాకిచ్చారు(Navya Nair). మల్లెపూలు పెట్టుకొని వచ్చినందుకు ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేశారు.

Navya Nair: మల్లెపూలు తెచ్చినందుకు లక్ష ఫైన్.. కంగుతిన్న మలయాళ నటి నవ్య

Malayalam actress Navya Nair fined Rs 1 lakh for bringing jasmine flowers

Updated On : September 8, 2025 / 3:51 PM IST

Navya Nair: మలయాళ బ్యూటీ నవ్య నాయర్ కు ఆస్ట్రేలియన్ పోలీసుకు షాకిచ్చారు. మల్లెపూలు పెట్టుకొని వచ్చినందుకు ఆమెకు ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేశారు. దాంతో ఆ నటి ఒక్కసారిగా అవాక్కయ్యిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. మలయాళీలకు ఓనం పండుగ అనేది చాలా ప్రత్యేకం. ఈ పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్‌ ఆఫ్‌ విక్టోరియా ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించింది. వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు నటి నవ్య నాయర్‌(Navya Nair). ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లో మల్లెపూలు ఉండటంతో మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆమెను ఆపారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్‌ విధించారు.

Adivi Sesh: సినిమా అంటే 9 టూ 5 జాబ్ కాదు.. హీరో అడివి శేష్ మాస్ కౌంటర్ ఎవరికి?

ఈ విషయాన్ని తరువాత జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు నటి నవ్య నాయర్. ఇంకా ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా వచ్చే ముందు తన కోసం తన తండ్రి మల్లెపూలు కొని తెచ్చారని, అందులో కొన్ని తలలో పెట్టుకోగా.. మరికొన్ని బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు చెప్పింది. ఆలాగే, తాను చేసింది తప్పెనని కానీ, తెలియక చేశానంటూ చెప్పుకొచ్చింది నవ్య. దీంతో, ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.