Adivi Sesh: సినిమా అంటే 9 టూ 5 జాబ్ కాదు.. హీరో అడివి శేష్ మాస్ కౌంటర్ ఎవరికి?
కొంతమంది కాల్ షీట్స్ విషయంలో స్టిక్స్ గా ఉంటారు. కేవలం ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే(Adivi Sesh) కాల్ షీట్స్ ఇస్తామని కండీషన్స్ పెడుతూ ఉంటారు.

Young hero adivi sesh interesting comments about film making
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి, ఆయన చేసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన సినిమాలతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రజెంట్ అడివి శేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. సినిమాకి సినిమాకి మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ కంటెంట్ విషయంలో మాత్రం ఏమాత్రం డిజప్పాయింట్ చేశారు అడివి శేష్(Adivi Sesh). ఇదిలా ఉంటే, ఇటీవల స్టార్స్ కాల్ షీట్స్ పై ఈ యంగ్ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కాల్ షీట్స్ విషయంలో చాలా స్టిక్స్ గా ఉంటారు. కేవలం ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే కాల్ షీట్స్ ఇస్తామని కండీషన్స్ పెడుతూ ఉంటారు. అది సినిమా ఇండస్ట్రీలో అస్సలు వర్క్ అవుట్ కాదు. ఎందుకంటే, సినిమా చేయడం అనేది 9 టూ 5 జాబ్ చేసినట్టుగా కాదు. యాక్టర్స్, మేకర్స్ మధ్య కంఫర్ట్ ఉంటే బాగుంటుంది. షెడ్యూల్ టైమింగ్స్ విషయంలో అడ్జెస్ట్ మెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు షెడ్యూల్స్ కొనసాగించే అవసరం పడుతుంది. కానీ, ఆ సమయంలో కూడా ఈ టైం వరకు మాత్రమే కాల్ షీట్స్ ఇస్తాం అనడం ఎంతవరకు కరక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కొంతమంది, అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈ స్టార్ కి ఇండైరెక్ట్ కౌంటర్ గానే శేష్ ఈ కామెంట్స్ చేశాడంటూ చెప్పుకుంటున్నారు. ఇక అడివి శేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గూడచారి 2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ రెండు సినిమాలు షూటింఫ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబందించిన రిలీజ్ డేట్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్.