Aryan Khan's Bads of Bollywood web series trailer released
Bads Of Bollywood: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. హిందీ చిత్ర పరిశ్రమపై రూపొందించిన ఈ సిరీస్ ఈ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్(Bads Of Bollywood) ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ట్రేలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Navya Nair: మల్లెపూలు తెచ్చినందుకు లక్ష ఫైన్.. కంగుతిన్న మలయాళ నటి నవ్య
ఇక్కడ మరో విశేషం ఏంటంటే, టాలీవుడ్ నుండి దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సిరీస్ లో స్పెషల్ రోల్ ప్లే చేశారు. అలాగే షారుక్, అమీర్ ఖాన్, దిశా పటానీ కూడా ఈ సిరీస్లో స్పెషల్ రోల్ చేశారు. దీంతో ఈ సిరీస్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి, షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చేస్తున్న మొదటి సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 18వరకు ఆగాల్సిందే.