Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నుంచి.. క్యూట్ గా స్వీట్ గా అంటూ బాధపడుతున్న చైతన్యరావు..
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా మూడో పాటను విడుదల చేసారు.

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Breakup Song Released
Honeymoon Express : 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు(Chaitanya Rao) ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో KKR, బాలరాజ్ నిర్మాణంలో చైతన్య రావు, హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Sunil : మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న సునీల్.. మెగాస్టార్ సినిమాలో విలన్‌గా..
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా మూడో పాటను విడుదల చేసారు. ‘క్యూట్ గా స్వీట్ గా స్మైలీలా.. సన్నగా నవ్వరా మెరుపులాగా..’ అంటూ సాగే మెలోడీ బ్రేకప్ పాటను నేడు హీరో అడివి శేష్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఆ పాటను మీరు కూడా వినేయండి..
ఇక ఈ క్యూట్ గా స్వీట్ గా పాటను కిట్టూ విస్సాప్రగడ రాయగా కళ్యాణి మాలిక్ సంగీత దర్శకత్వంలో సింగర్ దీపు పాడాడు. అడివి శేష్, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ డైరెక్టర్ బాలకు ఉన్న స్నేహంతో నేడు ఈ పాటని చూసి విడుదల చేశారు. పాట రిలీజ్ అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ.. క్యూట్ గా స్వీట్ గా పాట చాలా స్వీట్ గా ఉంది. సాహిత్యం చాలా బాగుంది. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలి అని అన్నారు.
అనంతరం డైరెక్టర్ బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా ఈ క్యూట్ గా స్వీట్ గా సాంగ్ ని విడుదల చేసినందుకు అడివి శేష్ గారికి కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికాలో విడుదల చేసే సమయంలో నన్ను సంప్రదించారు. అప్పట్నుంచి మా ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా సినిమాలో ప్రతి పాట బాగుంటుంది అని తెలిపారు.