Sunil : మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇస్తున్న సునీల్‌.. మెగాస్టార్ సినిమాలో విల‌న్‌గా..

టాలీవుడ్ క‌మెడియ‌న్ సునీల్ మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Sunil : మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇస్తున్న సునీల్‌.. మెగాస్టార్ సినిమాలో విల‌న్‌గా..

Sunil villain in Mammootty Turbo movie

Updated On : May 18, 2024 / 3:50 PM IST

Sunil – Turbo : టాలీవుడ్ క‌మెడియ‌న్ సునీల్ మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా కాదండోయ్ విల‌న్‌గా. అది కూడా చిన్నా చిత‌కా సినిమాతో కాదు ఏకంగా మెగాస్టార్ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. మల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్న సినిమా ట‌ర్చో. ఈ మూవీలో సునీల్ విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.

ఈ మేర‌కు సునీల్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ మూవీలో సునీల్ ఆటో బిల్లా అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. పోస్ట‌ర్‌లో సునీల్ బ్లాక్ సూట్ వేసుకుని చాలా కోపంగా కనిపిస్తున్నాడు.

Lokesh Kanagaraj : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో షార్ట్ ఫిలిం.. లోకేష్ సినిమా ప్రపంచాన్ని చూపించడానికి..

ఇదిలా ఉంటే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సునీల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలో తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి సునీల్‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే సునీల్ త‌మిళంలో జైల‌ర్‌, మ‌హావీర‌న్‌, మార్క్ ఆంటోనీ వంటి సినిమాల్లో న‌టించాడు. ఈ సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి. ప్ర‌స్తుతం సునీల్ పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్ చిత్రాల్లోనూ న‌టిస్తున్నాడు.

ఇక టర్బో మూవీ విష‌యానికి వ‌స్తే.. వైశాఖ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మమ్ముట్టి త‌న బ్యాన‌ర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమా 23 మే 2024న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Actor Chandrakanth : సీరియల్ నటుడు ఆత్మహత్య.. పవిత్ర మాయలో పడి.. భార్య సంచలన వ్యాఖ్యలు..

 

View this post on Instagram

 

A post shared by Mammootty Kampany (@mammoottykampany)