Actor Chandrakanth : సీరియల్ నటుడు ఆత్మహత్య.. పవిత్ర మాయలో పడి.. భార్య సంచలన వ్యాఖ్యలు..

తాజాగా చంద్రకాంత్ ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది.

Actor Chandrakanth : సీరియల్ నటుడు ఆత్మహత్య.. పవిత్ర మాయలో పడి.. భార్య సంచలన వ్యాఖ్యలు..

Actor Chandrakanth Wife Reacted on Pavitra Jayaram and Chandrakanth demise

Updated On : May 18, 2024 / 11:55 AM IST

Actor Chandrakanth : ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర – సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. పవిత్ర మరణించడంతో ఆ బాధని తట్టుకోలేక చంద్రకాంత్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే చంద్రకాంత్ కి గతంలోనే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వదిలేసి పవిత్రతో కలిసి ఉంటున్నాడు. తాజాగా చంద్రకాంత్ ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది.

చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ.. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడు. గతంలో చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర్నుంచి పవిత్రతో సంబంధం మొదలైంది. పవిత్రతో రిలేషన్ లో ఉంటూ నన్ను, పిల్లల్ని వదిలేసాడు. చందు నాతో ఐదేళ్లుగా మాట్లాడట్లేదు. పవిత్ర మీద చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడెన్ గా చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే చందు సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పారు. నాకు, నా పిల్లలకి న్యాయం జరగాలి అని వ్యాఖ్యలు చేసింది.

Also Read : Renu Desai : దయచేసి నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్..

ఇక సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ.. పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడు. మూడురోజుల క్రితం మా ఇంటికి వచ్చి పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. మేము అలా చేయొద్దని వారించాం. నిన్న పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెల్సిన వ్యక్తిని చందు ఫ్లాట్ కి పంపించాము. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీ లో సూసైడ్ చేసుకొని ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు కూడా వచ్చారు. పోస్ట్ మార్టం కోసం చందు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు అని తెలిపారు.