Renu Desai : దయచేసి నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్..
తాజాగా ఓ పవన్ అభిమాని చేసిన కామెంట్ కి రేణు దేశాయ్ ఫైర్ అయింది.

Renu Desai Fires on Pawan Kalyan Fans post Goes Viral
Renu Desai : పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్ విడిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా రేణు దేశాయ్ ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ పోస్టులకు కామెంట్స్ చేస్తారు, పవన్ తో కంపేర్ చేస్తారు. పవన్, రేణు ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్స్ వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నా పవన్ అభిమానులు మాత్రం ఏదో రకంగా రేణు విషయంలో పవన్ కళ్యాణ్ ని తీసుకొస్తారు. ఇప్పటికే పలుమార్లు రేణు దేశాయ్ నన్ను వదిలేయండి అంటూ పోస్టులు, కామెంట్స్ పెట్టినా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇంకా అదే పనిగా రేణు దేశాయ్ పోస్టుల కింద పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూ కామెంట్స్ చేస్తారు.
ఇటీవల రేణు దేశాయ్ కుక్కలు, పిల్లులు, పలు జంతువుల కోసం సర్వీస్ చేస్తుంది. యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. తాజాగా ఓ పవన్ అభిమాని రేణు దేశాయ్ సర్వీస్ కి సంబంధించిన ఓ పోస్ట్ కి.. వాళ్ళు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ హార్ట్ అని కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ.. ఎందుకు ప్రతిసారి నా పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తారు. ఇప్పటికే ఇలాంటి వాళ్ళని చాలామందిని బ్లాక్ చేశాను, డిలీట్ చేశాను. నేను సింగిల్ గా యానిమల్ సర్వీస్ చేస్తున్నాను నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి. దీనికి నా ఎక్స్ హస్బెండ్ కి సంబంధం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా ప్రతి పోస్ట్ కి ఆయనతో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెట్టడం ఆపండి. అతను నాలాగా యానిమల్స్ పై ప్రేమ, కేరింగ్ చూపించడు అని కామెంట్ చేసింది.
Also Read : RGV – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ.. పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా..
ఈ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇలాంటి రిప్లైలు నాకు చాలా బాధని, కోపాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నేళ్ళైనా నా సొంతంగా నేనేం చేసినా దాన్ని నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తారు. అతనితో నాకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ లేదు. కానీ అతని ఫాలోవర్స్ నన్ను నన్నుగా వదిలేయండి అని పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై కూడా మళ్ళీ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తారేమో. కొంతమంది మాత్రం రేణు దేశాయ్ కి సపోర్ట్ గా ఆమె లైఫ్ ఆమెని బతకనివ్వండి అంటూ మొదట్నుంచి కూడా కామెంట్స్ చేస్తున్నారు.