RGV – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ.. పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా..

డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.

RGV – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ.. పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా..

Ram Gopal Varma and Directors Association Met CM Revanth Reddy and Invited for Directors Day Celebrations

RGV – CM Revanth : దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. ఇటీవల డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడటంతో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మే 4న జరగాల్సిన డైరెక్టర్స్ డేని(Directors Day) ఈసారి గ్రాండ్ గా మే 19న LB స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి సెలబ్రేట్ చేయనున్నట్టు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించారు.

మే 19న LB స్టేడియంలో జరగబోయే డైరెక్టర్స్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ పాల్గొని స్కిట్స్, డ్యాన్సులు.. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నారు. అలాగే పలువురు హీరోలు, హీరోయిన్స్, నటీనటులు కూడా ఈ ఈవెంట్లో హాజరు కానున్నారు. ఇక డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.

Also Read : Balakrishna : ఎన్నికలు ముగిశాయి.. షూట్‌లో అడుగుపెడుతున్న బాలయ్య బాబు..

డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ వీరశంకర్ తో పాటు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట.. పలువురు డైరెక్టర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందచేసి ఈవెంట్ కి ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి రామ్ గోపాల్ వర్మ కూడా వెళ్లడం విశేషం. ఆర్జీవీ కూడా సీఎం రేవంత్ ని కలవడం చర్చగా మారింది. అసలు ఇలాంటి అసోసియేషన్ కార్యక్రమాలకు ఎప్పుడూ రాని ఆర్జీవీ ఇప్పుడు సీఎం రేవంత్ ని ఆహ్వానించడానికి వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్జీవీ గతంలో రేవంత్ ని అభినందిస్తూ పలుమార్లు ట్వీట్స్ కూడా చేసారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జీవీ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో డైరెక్టర్స్ డే ఈవెంట్లో ఆర్జీవీ, సీఎం రేవంత్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.