Balakrishna : ఎన్నికలు ముగిశాయి.. షూట్‌లో అడుగుపెడుతున్న బాలయ్య బాబు..
ఎన్నికల నేపథ్యంలో NBK 109 సినిమా షూటింగ్ కి బాలయ్య రెండు నెలల క్రితం బ్రేక్ ఇచ్చారు.

Balakrishna NBK 109 Shooting will starts after Election Break
Balakrishna : గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావిడి జరిగింది. మే 13న ఎన్నికలు అయిపోవడంతో బిజీగా ఉన్న నాయకులు, సినిమా వాళ్ళు కూడా ఫ్రీ అయ్యారు. బాలకృష్ణ కూడా ఎన్నికల ప్రచారంలో ఫుల్ గా తిరిగారు. మరోసారి హిందూపూర్ లో పోటీ చేస్తుండటంతో ఫుల్ ఫోకస్ అక్కడే పెట్టి ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారు ఇన్నాళ్లు. ఎన్నికల నేపథ్యంలో NBK 109 సినిమా షూటింగ్ కి రెండు నెలల క్రితం బ్రేక్ ఇచ్చారు.
బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య నిర్మాణంలో భారీగా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. 1980లో స్టోరీతో, ఫుల్ యాక్షన్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ పడిన NBK 109 సినిమా రేపట్నుంచి మళ్ళీ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. బాలకృష్ణ హిందూపూర్ నుంచి తిరిగి వచ్చి రేపట్నుంచి హైదరాబాద్ లో NBK 109 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు టాలీవుడ్ సమాచారం.
Also Read : Anupama Parameswaran : మళ్ళీ బెల్లంకొండ హీరోతో అనుపమ సినిమా చేయబోతుందా? టైటిల్ ఇదేనా?
ఇక బాలయ్య బాబు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఈ సినిమాతో కూడా మరో భారీ హిట్ కొట్టి అదే ఫామ్ కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు.