Airtel 5G Services : పూణె ఎయిర్‌పోర్టులో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్‌లో 5G నెట్‌వర్క్ సపోర్టు చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి!

Airtel 5G Services : ప్రస్తుతం భారత మార్కెట్లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) తమ 5G నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించాయి.

Airtel 5G Services : ప్రస్తుతం భారత మార్కెట్లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) తమ 5G నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించాయి. ముందుగా ఎంపిక చేసిన నగరాల్లోనే ప్రారంభించిన 5G సర్వీసులను మరిన్ని నగరాల్లోకి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌ను పూణె విమానాశ్రయంలో ప్రారంభించింది. Airtel 5G Plus ఇప్పుడు పూణే లోహెగావ్ విమానాశ్రయంలో అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో ఎయిర్‌టెల్ 5G సేవలను పొందిన తొలి విమానాశ్రయంగా పూణె విమానాశ్రయం నిలిచింది.

ఇప్పుడు, పూణె విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రస్తుత డేటా ప్లాన్‌లలో హై-స్పీడ్ ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ను ఉపయోగించవచ్చు. నెట్‌వర్క్ కనెక్టివిటీ అరైవల్, డిపార్చర్ టెర్మినల్స్, బోర్డింగ్ గేట్‌లు, లాంజ్‌లు, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, మైగ్రేషన్, బ్యాగేజ్ క్లెయిమ్ బెల్ట్‌లు, సెక్యూరిటీ ఏరియాలు, పార్కింగ్ ప్రాంతాలు మొదలైన వాటిలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న Airtel 4G SIM 5Gగా లాంచ్ అయింది. కొత్త జెన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావడానికి యూజర్లు కొత్త SIM కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని Airtel గతంలోనే హామీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో కూడా Airtel 5G సేవలను ప్రారంభించింది. Airtel 5G ఇప్పుడు 11 నగరాల్లో అందుబాటులో ఉంది.

Airtel 5G అందుబాటులో ఉన్న నగరాల జాబితా :
5G ఫోన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్‌లు వారి ప్రస్తుత డేటా ప్లాన్‌లలో హై-స్పీడ్ ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న Airtel 4G SIM 5G లాంచ్ అయినందున కస్టమర్‌లు సిమ్‌ని మార్చాల్సిన అవసరం లేదు.

– పూణే
– ఢిల్లీ
– ముంబై
– చెన్నై
– హైదరాబాద్
– బెంగళూరు
– పానిపట్
– గురుగ్రామ్
– సిలిగురి
– బెంగళూరు
– నాగపూర్

Airtel 5G now available in Pune airport_ when will you get to use Airtel 5G on your phone

Airtel 5Gకి ఎలా కనెక్ట్ చేయాలంటే :
Airtel 5G Plus మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నప్పటికీ.. మీరు ఇప్పటికీ మీ ఫోన్‌ని నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయలేకపోతున్నారా?
* మీ ఫోన్ ‘Settings’కి వెళ్లండి.
* ‘Mobile Network’ ఆప్షన్ ఎంచుకోండి.
* ఇప్పుడు మీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకుని, ఆపై ‘Preferred network type’ ఎంపికను ఎంచుకోండి.
* మీరు 3G, 4G, 5Gతో సహా నెట్‌వర్క్ ఆప్షన్లను చూస్తారు. అక్కడ 5Gని ఎంచుకోండి.

మీరు 5G స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? 5th జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీకి సపోర్టు ఇవ్వడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేసుకున్నారో లేదో ఓసారి చెక్ చేయండి. Xiaomi, OnePlus, Oppo, Samsung, ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 5Gకి సపోర్టు కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ చేస్తున్నారు. Apple ప్రతి ఒక్కరికీ iOS 16.2 అప్‌డేట్‌ను డిసెంబర్‌లో రిలీజ్ చేయనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio-Airtel 5G : దేశంలో మరిన్ని నగరాలకు జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్‌లో 5G ఎలా యాక్టివేట్ చేయాలంటే?

ట్రెండింగ్ వార్తలు