Allu Arjun – Shilpa Ravi : వైసీపీ నేత శిల్పా రవి, అల్లు అర్జున్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీకి రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా?

శిల్పా రవి, అల్లు అర్జున్ మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది అనేది గతంలో ఓ ఇంటర్వ్యూలో శిల్పా రవిచంద్ర తెలిపాడు.

Shilpa Ravichandra Kishore Says about his Friendship with Allu Arjun

Allu Arjun – Shilpa Ravi : నిన్న అల్లు అర్జున్ వైసీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా ర‌వి చంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. శిల్పా రవి తనకు మంచి స్నేహితుడని, అందుకే అతని కోసం ప్రచారానికి వచ్చానని అల్లు అర్జున్ నిన్నటి ప్రచారం లో చెప్పాడు. అయితే శిల్పా రవి కోసం భార్యతో కలిసి మరీ నంద్యాల వెళ్లి ప్రచారం చేయడంతో వీళ్లిద్దరు అంత మంచి స్నేహితులా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

శిల్పా రవి, అల్లు అర్జున్ మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది అనేది గతంలో ఓ ఇంటర్వ్యూలో శిల్పా రవిచంద్ర తెలిపాడు. శిల్పా రవి మాట్లాడుతూ.. నా వైఫ్, అల్లు అర్జున్ వైఫ్ క్లాస్ మేట్స్. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. అలా నేను, అల్లు అర్జున్ కలిసాము. మేమిద్దరం బయట పార్టీల్లో ఎక్కువగా కలిసేవాళ్ళం. గతంలో వేరే దేశాలకు అల్లు అర్జున్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ వేశాము. అలా మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము. అల్లు అర్జున్ కి రాజకీయాలపై చాలా అవగాహన ఉంది. తాను డైరెక్ట్ రాజకీయాల్లోకి రాకపోయినా మా లాంటి యువత రాజకీయాల్లోకి రావాలని, సమాజాన్ని మార్చాలని మాట్లాడేవాడు. మేము కలిస్తే సినిమాల కంటే కూడా రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. అందుకే నేను రాజకీయాల్లో ఉంటే ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. నా కోసం ప్రచారానికి నేను అడక్కపోయినా వస్తాను అన్నాడు అని తెలిపారు.

Also Read : Ram Pothineni : ‘డబల్ ఇస్మార్ట్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టీజర్ రిలీజ్ అప్పుడే..

అలా శిల్పా రవితో ఉన్న స్నేహంతో అల్లు అర్జున్ ఇచ్చిన మాట కోసం నిన్న నంద్యాల వచ్చి ప్రచారం చేశారు. ఇక అల్లు అర్జున్ నంద్యాల వచ్చి సందడి చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.