Ram Pothineni : ‘డబల్ ఇస్మార్ట్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టీజర్ రిలీజ్ అప్పుడే..

తాజాగా డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Ram Pothineni : ‘డబల్ ఇస్మార్ట్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టీజర్ రిలీజ్ అప్పుడే..

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Poster Released Teaser Release Date Announced

Updated On : May 12, 2024 / 10:12 AM IST

Ram Pothineni : పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar)కు సీక్వెల్ ప్రకటించి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ మార్చ్ లో రిలీజవ్వల్సిన ఈ సినిమా షూటింగ్ అవ్వకపోవడంతో వాయిదా పడింది. పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్(Double Ismart) భారీగా తెరకెక్కుతుంది.

Also Read : Yakshini Web Series : మంచులక్ష్మితో బాహుబలి నిర్మాత వెబ్ సిరీస్.. భయపెట్టడానికి వచ్చేస్తున్నారు..

డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ముంబైలోనే జరుగుతున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. సినిమా మొదలయి చాలా రోజులు అవుతున్నా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో రామ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. డబల్ ఇస్మార్ట్ నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Poster Released Teaser Release Date Announced

అలాగే డబల్ ఇస్మార్ట్ టీజర్ ని రామ్ పోతినేని బర్త్‌డే మే 15న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ని మించి డబల్ ఇస్మార్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డబల్ ఇస్మార్ట్ నుంచి రిలీజ్ చేసిన రామ్ సరికొత్త లుక్ వైరల్ అవుతుంది.