KKR vs MI : ముంబై జట్టుపై విజయంతో సరికొత్త రికార్డును నమోదు చేసిన కోల్‌క‌తా జట్టు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. ఈ మైదానంలో ఒక సీజన్ లో ఐదు, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లను కేకేఆర్ జట్టు అనేకసార్లు గెలుచుకుంది.

KKR Team (Credits @Twitter)

IPL 2024 KKR vs MI : ఐపీఎల్ -2024లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్ లో విజయంతో ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకున్న తొలి జట్టు కేకేఆర్. దీనికితోడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పేరిట ఓ ప్రత్యేక రికార్డు నమోదైంది.

Also Read : IPL 2024 : వామ్మో.. ఇదేం బౌలింగ్ బుమ్రా..! సునీల్ నరైన్‌కు దిమ్మ‌తిరిగింది.. వీడియో వైరల్

ముంబై జట్టుపై విజయం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఏదైనా ఒక మైదానంలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కోల్ కతా జట్టు రికార్డు నెలకొల్పింది. కేకేఆర్ జట్టు ఈడెన్ గార్డెన్స్ లో మొత్తం 52 మ్యాచ్ లలో గెలిచి అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియంలో 52 మ్యాచ్ లలో విజయం సాధించగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ 49 మ్యాచ్ లలో విజయం సాధించింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 42 మ్యాచ్ లలో, జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 37 మ్యాచ్ లు గెలిచింది.

Also Read : IPL 2024 – KKR vs MI : ముంబై చిత్తు.. కోల్‌కతా సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. ఈ మైదానంలో ఒక సీజన్ లో ఐదు, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లను కేకేఆర్ జట్టు అనేకసార్లు గెలుచుకుంది. వీటిలో 2010లో కేకేఆర్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడగా అందులో ఐదు గెలిచింది. 2015లో ఆరు మ్యాచ్ లలో ఐదు గెలిచింది. 2018లో తొమ్మిది మ్యాచ్ లలో ఐదు గెలిచింది. 2024లో ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడగా అందులో ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇదిలాఉంటే.. 2014 లో కేకేఆర్ జట్టు ఈడెన్ గార్డెన్స్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడింది. ఆ నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు