IPL 2024 : వామ్మో.. ఇదేం బౌలింగ్ బుమ్రా..! సునీల్ నరైన్‌కు దిమ్మ‌తిరిగింది.. వీడియో వైరల్

కోల్ కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. సాల్ట్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజులో వెంకటేశ్, సునీల్ నరైన్ ఉన్నారు. నరైన్ ఇంకా ఖాతా తెరవలేదు.

IPL 2024 : వామ్మో.. ఇదేం బౌలింగ్ బుమ్రా..! సునీల్ నరైన్‌కు దిమ్మ‌తిరిగింది.. వీడియో వైరల్

Jasprit Bumrah Bowling Sunil Narine out (Credit goes Twitter)

Updated On : May 12, 2024 / 9:47 AM IST

Jasprit Bumrah Bowled KKR vs MI : ఐపీఎల్ -2024లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ర్పీత్ బుమ్రా వేసిన అద్భుత బంతితో టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న సునీల్ నరైన్ డకౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IPL 2024 – KKR vs MI : ముంబై చిత్తు.. కోల్‌కతా సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

కోల్ కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. సాల్ట్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజులో వెంకటేశ్, సునీల్ నరైన్ ఉన్నారు. నరైన్ ఇంకా ఖాతా తెరవలేదు. రెండో ఓవర్ బుమ్రా ప్రారంభించాడు. మొదటి బాల్ కే నరైన్ ను పెవిలియన్ బాట పట్టించాడు. బుమ్రా వేసిన బాల్ యార్కర్ రూపంలో దూసుకెళ్లింది. సునీల్ నరైన్ ఆ బంతి వికెట్లకు దూరంగా వెళ్తుందని భావించి బ్యాట్ పైకెత్తి ఆడకుండా బాల్ ను వదిలేశాడు. కానీ, బంతి వికెట్ల ముందు పడినవెంటనే స్వింగ్ అయ్యి బెయిల్స్ ను పడగొట్టింది. అసలేం జరిగిందో క్రీజులో ఉన్న సునీల్ నరైన్ కు అర్ధం కాలేదు. వెంటనే తేరుకొని క్రీజు నుంచి నరైన్ పెవిలియన్ బాట పట్టాడు.

Also Read : ఓరి వీళ్ల దుంపతెగ.. క్రికెట్ ఆడుతున్నారా? చేపలు పడుతున్నారా! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకుసైతం నరైన్ ఎలా ఔట్ అయ్యాడో అర్థంకాలేదు. రీప్లేలో చూడగా బుమ్రా వేసిన అద్భుత బంతి చివరిలో టర్న్ అయ్యి వికెట్లను తాకినట్లు కనిపించింది. ఇదిలాఉంటే.. సునీల్ నరైన్ ఐపీఎల్ 2024 లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లలో 461 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో కేకేఆర్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. నరైన్ డకౌట్ కావటం ఈ సీజన్ లో ఇదే తొలిసారి. నరైన్ 2012లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తరువాత ఏడు సార్లు డకౌట్ అయ్యాడు.