Hardik Pandya : తొమ్మిది మ్యాచుల్లో ఓడిన ముంబై.. పాండ్య కెప్టెన్సీపై యువ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 9 మ్యాచుల్లో ఓట‌మిపాలైంది. 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.

Gerald Coetzee praises Hardik Pandya captaincy skills

Hardik Pandya – Gerald Coetzee : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణంగా విఫ‌లమ‌వుతోంది. స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డంలో విఫ‌లమైంది. క‌నీసం ఆఖ‌రి మ్యాచుల్లోనైనా గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటే అది జ‌ర‌గ‌డం లేదు. శ‌నివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 18 ప‌రుగుల‌ తేడాతో ఓడిపోయింది.

మొత్తంగా ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 9 మ్యాచుల్లో ఓట‌మిపాలైంది. 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో చివ‌రి మ్యాచును ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ఆడ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ముంబై ప‌గ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్య త‌న మార్క్‌ను చూపించ‌డంలో విఫ‌లం అయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా నిరాశ ప‌రుస్తున్నాడు. ఈ క్ర‌మంలో ముంబై యువ ఫాస్ట్ బౌల‌ర్ గెరాల్డ్ కోయెట్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. హార్దిక్ పాండ్య అద్భుతమైన కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు ఈ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్‌.

KKR vs MI : ముంబై జట్టుపై విజయంతో సరికొత్త రికార్డును నమోదు చేసిన కోల్‌క‌తా జట్టు

పాండ్య కెప్టెన్సీ శైలి త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రేరణ కలిగించాడని కోయెట్జీ వెల్లడించాడు. అతను నిజంగా మంచి కెప్టెన్ అని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. ‘ఏ కెప్టెన్ ఒకేలా ఉండ‌డు. ఇక హార్దిక్ ప్ర‌తి ఒక్క ప్లేయ‌ర్‌కు ఎంతో స‌పోర్ట్‌గా ఉంటాడు. ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించ‌డంలో దిట్ట‌. అతని కెప్టెన్సీ శైలి న‌చ్చింది. అతను నిజంగా మంచివాడు. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి విభేదాలు లేవు. విజ‌యంతో టోర్నీ ముగించేందుకు ప్ర‌య‌త్నిస్తాం.’ అని గెరాల్డ్ కోయెట్జీ అన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే.. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌ను 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. వెంక‌టేష్ అయ్య‌ర్ (21 బంతుల్లో 42), నితీశ్ రాణా (23 బంతుల్లో 33) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో కోల్‌క‌తా 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (22 బంతుల్లో 40), తిల‌క్ వ‌ర్మ (17 బంతుల్లో 32) ఫ‌ర్వాలేద‌నిపించారు.

IPL 2024 : వామ్మో.. ఇదేం బౌలింగ్ బుమ్రా..! సునీల్ నరైన్‌కు దిమ్మ‌తిరిగింది.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు