Airtel Prepaid: మరింత ప్రియం కానున్న ఎయిర్‌టెల్ ధరలు

గతేడాది సంవత్సరం, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. ఇప్పుడు సబ్‌స్క్రైబర్‌లకు మరింత ఎఫెక్ట్ చూపించేలా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది.

Airtel Prepaid: గతేడాది సంవత్సరం, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. ఇప్పుడు సబ్‌స్క్రైబర్‌లకు మరింత ఎఫెక్ట్ చూపించేలా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది.

ఈ వార్తలను కంపెనీ సీఈవో గోపాల్ విట్టల్ కన్ఫామ్ చేశారు. 2022లో ఎయిర్‌టెల్ మళ్లీ ధరను పెంచే అవకాశం ఉందని.. ఈసారి ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) రూ.200గా నిర్ణయించబడుతుందని వెల్లడించారు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, 5G కోసం టెలికాం రెగ్యులేటర్ బేస్ ధరలతో ఎయిర్‌టెల్ సంతోషంగా లేదని అన్నారు.

“ధరలలో భారీ డిస్కౌంట్ కోసం ఇండస్ట్రీ ఆశించింది. తగ్గింపు ఉన్నప్పటికీ, అది తగినంతగా లేదు. ఆ కోణంలో నిరుత్సాహపరిచింది, ”అని విట్టల్ బుధవారం చెప్పారు. గతేడాది మూడు ప్రైవేట్ యాజమాన్యాలైన టెలికాం ఆపరేటర్లు ప్లాన్ ధరలను దాదాపు 18 నుండి 25 శాతం పెంచారు.

Read Also : యూజర్ల దెబ్బకు జియో, వోడాఫోన్ ఐడియా డీలా.. ఎయిర్‌టెల్ ఫుల్ జోష్..!

5G రివర్స్ ధరల కోసం TRAI సిఫార్సుతో టెలికాం ఆపరేటర్లు సంతోషంగా లేరు. 5G రిజర్వ్ ధరలను 90 శాతం తగ్గించాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి.

“ఈ ఏడాది కాలంలో కొంత టారిఫ్‌ల పెరుగుదలను చూడాలని నా సొంత ఫీలింగ్. ఆ స్థాయిలో టారిఫ్‌లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని నమ్ముతున్నా. కొత్త ధరల పెంపు తాత్కాలిక తప్పిదం మాత్రమే. ధరల పెంపు ఉన్నప్పటికీ, ఎయిర్‌టెల్ మార్చిలో ఎక్కువ మంది 4G వినియోగదారులను ఆకర్షించింది (5.24 మిలియన్లు). ఇది మునుపటి మూడు నెలల వ్యవధిలో 3 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ” అని విట్టల్ వెల్లడించారు.

నవంబర్ 2021లో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను 18 నుండి 25 శాతం వరకు పెంచింది ఎయిర్‌టెల్. వోడాఫోన్ ఐడియా కూడా అదే శ్రేణిలో తన టారిఫ్‌లను సవరించింది. రిలయన్స్ జియో ధరలను 20 శాతం వరకు పెంచింది. రిలయన్స్ జియో 2022లో టారిఫ్‌ల పెంపు ఉందా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు.

ట్రెండింగ్ వార్తలు