Veena artist Srivani : ‘వీణ’పై ‘వీణా శ్రీవాణి’ ‘డోరేమాన్’ సాంగ్.. ఏ పాటకైనా ఆమె వేళ్లు రాగాలు పలికిస్తాయి..

వీణపై ఆమె వేళ్లు పరుగులు పెడతాయి. అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తాయి. తాజాగా 'డోరేమాన్' టైటిల్ ట్రాక్‌ను సైతం వీణపై వాయించి ఔరా అనిపించారు ఆర్టిస్ట్ వీణా శ్రీవాణి.

Veena artist Srivani

Veena artist Srivani : వీణపై కళాకారులు సప్త స్వరాలు పలికిస్తూ ఉంటారు. చాలామంది తెలుగు సంగీత దర్శకులు తమ పాటల్లో వీణను ఉపయోగించారు.. అలాగే చాలా సినిమాల్లో నటీనటులు వీణ వాయిస్తున్న పాటలు ఉన్నాయి. విషయానికి వస్తే వీణ కళాకారిణి ‘వీణా శ్రీవాణి’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏ పాటకైనా అలవోకగా వీణపై తన వేళ్లను పరుగులు పెట్టిస్తారావిడ. వీణపై పాటలు వాయించడంలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పాలి. రీసెంట్‌గా ‘డోరేమాన్’ సాంగ్‌ని వీణపై వాయించి అందరినీ అబ్బురపరిచారు.

Film Writer Veena Pani : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ఘన సన్మానం

కార్టూన్లు అంటే అందరికీ ఇష్టమే. చిన్నతనంలో అందరూ కార్టూన్లు చూస్తారు. ఇప్పటికీ పెద్దవారిలో చాలామంది కార్టూన్లు చూస్తుంటారు. ఇక ‘డోరేమాన్’‌ని ఎవరైనా మర్చిపోగలరా?.. దాని టైటిల్ ట్రాక్ మర్చిపోగలరా?.. మర్చిపోయినా ‘వీణా శ్రీవాణి’ ఉన్నారుగా.. రీసెంట్‌గా వీణపై డోరేమాన్ టైటిల్ ట్రాక్‌ని అలవోకగా వాయించేసారు శ్రీవాణి. ‘డోరేమాన్ టైటిల్ సాంగ్’ అనే శీర్షికతో తన ట్విట్టర్ అకౌంట్‌లో స్వయంగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వీణా శ్రీవాణి ఈ ట్రాక్ అనే కాకుండా అనేక పాటలను వీణపై అద్భుతంగా వాయించారు. అనేక చోట్ల ప్రదర్శనల్లో పాల్గొని అందరి మన్ననలు, సత్కారాలు అందుకున్నారు.

Musical Steps in Metro Station: ఆ మెట్రో స్టేషన్ లో మెట్లు ఎక్కుతుంటే..పియానో సంగీతం వినిపిస్తుంది..

ఇక శ్రీవాణి వీడియో చూసిన నెటిజన్లు ‘తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసారని .. స్కూల్ నుంచి రాగానే భోజనం చేస్తూ డోరేమాన్ చూసేవారమని’ కామెంట్ చేసారు. ‘ఆరోజుల్ని మిస్ అవుతున్నామని మరికొందరు.. మీ సంగీతం అద్భుతం అని కొందరు’.. ప్రశంసలు కురిపించారు. వీణ వంటి సంగీత పరికరాలకు కాలం చెల్లింది అనుకోవడానికి అస్సలు లేదు.. వీణా శ్రీవాణి లాంటి ఎందరో కళాకారులు తమ ప్రావీణ్యంతో వీటిని జీవం పోస్తున్నారు. భవిష్యత్ తరాలకు వారధిగా నిలుస్తున్నారు. హ్యాట్సాఫ్ టూ వీణా శ్రీవాణిగారు.

ట్రెండింగ్ వార్తలు