Assam flood worsens: కురుస్తున్న భారీవర్షాలు..వరదలతో అసోం అతలాకుతలం

అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలం అయింది.బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.వందలాది గ్రామాలు నీట మునిగాయి....

అసోంను వణికిస్తున్న వరద విపత్తు

Assam flood worsens: అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలం అయింది(Incessant Rain Continues)బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. 11 జిల్లాల్లో వరద పీడిత ప్రాంతాల నుంచి 34వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.(34,000 people affected) ఈ వరదలపై అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ రోజు వారీగా వరద నివేదికలను విడుదల చేస్తోంది.

Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం

14,675 మంది మహిళలు, 3,787 మంది చిన్నారులతో కలిపి మొత్తం 34,189 మంది వరద ప్రభావంతో అల్లాడిపోతున్నారు.బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, తముల్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాలుగా మారాయి.లఖింపూర్‌లో 8, ఉదల్‌గురిలో2 చొప్పున పదకొండు సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.అసోంలో 77 గ్రామాలు వరదల వల్ల ముంపునకు గురయ్యాయి.

Furniture Warehouse Fire breaks out : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

అస్సాం అంతటా 209.67 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది.లఖింపూర్‌, ఉదల్‌గురిలో చెరువుల కట్టలు తెగిపోయాయి.బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్, మోరిగావ్, నల్బారి, సోనిత్‌పూర్, తముల్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయి.

Putin confirms first nuclear weapons: ఫస్ట్ అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించాం..వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు

భారీ వర్షాల కారణంగా దిమా హసావో, కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అసోం అధికారులు చెప్పారు.బక్సా, బిస్వనాథ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లఖింపూర్, నల్బరీ, ఉదల్‌గురి జిల్లాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ట్రెండింగ్ వార్తలు