Putin confirms first nuclear weapons: ఫస్ట్ అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించాం..వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు

యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు....

బెలారస్‌కు పుతిన్ పంపిన అణ్వాయుధాలు

Putin confirms first nuclear weapons: యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. (first nuclear weapons moved to Belarus)రష్యా దేశ భూభాగానికి బెదిరింపులు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ చెప్పారు.

Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం

కాగా యుక్రెయిన్‌పై దాడి చేయడానికి క్రెమ్లిన్ అణ్వాయుధాలను ఉపయోగించాలని యోచిస్తున్న సూచనలు లేవని యూఎస్ ప్రభుత్వం పేర్కొంది.పుతిన్ వ్యాఖ్యల తర్వాత అమెరికా విదేశాంగ శాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు మాకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదు’’ అని ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

Devineni Uma : మా ప్రభుత్వం వచ్చాక.. జైలుకెళ్లడం ఖాయం- దేవినేని ఉమ వార్నింగ్

బెలారస్ రష్యాకు కీలకమైన మిత్రదేశం.గత ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా పనిచేసింది.అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్నా, వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను బెలారస్‌కు బదిలీ చేయడం వేసవి చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ చెప్పారు.సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం గురించి ఫోరమ్ మోడరేటర్‌ అడిగినప్పుడు, పుతిన్ ఇలా సమాధానమిచ్చారు.

Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, ముగ్గురి మృతి ఏడుగురికి తీవ్ర గాయాలు

‘‘మేం మొత్తం ప్రపంచాన్ని ఎందుకు బెదిరించాలి? రష్యా దేశ హోదాకు ప్రమాదం ఉన్నట్లయితే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని నేను ఇప్పటికే చెప్పాను’’ అని పుతిన్ స్పష్టం చేశారు. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన మిస్సైళ్లు, బాంబులు వచ్చాయి..ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధికంగా శక్తిమంతమైనవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ధ్రువీకరించారు.

ట్రెండింగ్ వార్తలు