డిప్రెషన్‌లో ఉన్న ఈ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్

డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు.

డిప్రెషన్‌లో ఉన్న ఓ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో శాంటా రోసా బీచ్ సమీపంలో కొందరు ఆ ఎలుగు బంటితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. దీనిపై వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందిస్తూ… ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లవద్దని, దానితో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించారు.

డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు. ఓ ఎలుగు బంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఫొటో చూస్తే తెలుస్తోంది. ఆ ఎలుగుబంటి చెట్టు దగ్గర కూర్చొని కదలకుండా ఉన్న తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఎలుగు బంటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. మనుషులతో మృగాలకు ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆ ఎలుగు బంటి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు

ట్రెండింగ్ వార్తలు