రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గంటకు మూడు కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు

Rain Alert

Heavy rains in Hyderabad : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గంటకు మూడు కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వాన పడుతుంది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు.. వీడియో వైరల్

హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి నగరం మొత్తం ముసురుపట్టింది. మోస్తరు వర్షం పడుతోంది. రోడ్లన్నీ వర్షపు నీటితో దర్శనమిస్తున్నాయి. సోమ, మంగళవారం నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

Also Read : Real Estate Boom : హైదరాబాద్‌లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం