Sachin Tendulkar : అర్జున్, సానియా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. సచిన్ కామెంట్స్.. కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి..
అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో సచిన్ (Sachin Tendulkar) మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Arjun Tendulkar and Saaniya Chandhok Pre Wedding Festivities Begin Sachin comments viral
- అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు
- అర్జున్ గురించి సచిన్ టెండూల్కర్ కామెంట్స్
- పీకల్లోతు ప్రేమలో అర్జున్, సానియాలు
Sachin Tendulkar : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌ను అర్జున్ వివాహం చేసుకోనున్నాడు. వీరి పెళ్లి 2026 మార్చి 5న జరగనుంది. వీరి వివాహ వేడుకకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాన నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి నేతలను పెళ్లికి ఆహ్వానించారు.
కాగా.. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్, సానియా కలిసి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం అయినట్లు అర్థమవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. ఈ వేడుకలో తన కొడుకు గురించి సచిన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఒక కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసినప్పుడే, ఆ తండ్రికి తన కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమవుతుంది అని సచిన్ అన్నాడు. ఇక అర్జున్, సానియాలు ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారన్నాడు. తనకు నచ్చిన, తనను అంతే ప్రేమించే తోడును అర్జున్ వెతుక్కున్నందుకు ఓ తండ్రిగా తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నాడు.
𝙎𝙤𝙢𝙚 𝙗𝙤𝙣𝙙𝙨 𝙨𝙩𝙖𝙮 𝙛𝙤𝙧𝙚𝙫𝙚𝙧 💙
Here’s wishing Arjun and Saaniya, love, respect and a lifetime of togetherness as they embark on a partnership like no other ✨ pic.twitter.com/prKlwXv24R
— Mumbai Indians (@mipaltan) February 25, 2026
అర్జున్, సానియాల నిశ్చితార్థం ఆగస్టు 2025లో జరిగింది. ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే.. ఇటీవలే ఐపీఎల్ 2026 వేలం కన్నా ముందు అతడు ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడింగ్ ద్వారా బదిలీ అయ్యాడు. దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సానియా విషయానికి వస్తే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు.
