Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే?
Gold Rate Today : బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ బంగారం రేటు తగ్గింది.

బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ బంగారం రేటు తగ్గింది. గత వారంరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న గోల్డ్ రేటు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం పెండ్లిళ్ల జోరు కొనసాగుతోంది. శుభముహూర్తాలు ఉండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అయితే, వారం రోజులుగా గోల్డ్ రేటు పెరగడంతో పసిడి ప్రియులు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే, ఇవాళ స్వల్పంగా బంగారం ధర తగ్గండంలో వారికి ఊరటనిచ్చినట్లయింది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల బంగారంపై రూ. 210 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై ఆరు డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు బంగారం 5,201 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బుధవారం భారీగా పెరిగిన వెండి ధరలో ఇవాళ (గురువారం) ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,680కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,200 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,830 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,350 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,680కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,200 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,62,770 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,200 వద్దకు చేరింది.

వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
