China bridge collapse : చైనాలో భారీ వర్షాలు.. వంతెన కూలి 11 మంది మృతి.. వీడియో వైరల్

భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాత్రి వంతెన కూలి 11 మంది మరణించారు.

China bridge collapse

China Rains : భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాత్రి వంతెన కూలి 11 మంది మరణించారు. మరో 30 మంది గల్లంతయ్యారు. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రెస్క్యూ సిబ్బంది గల్లంతయిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. శనివారం ఉదయం 10గంటల సమయానికి రెస్క్యూ ఆపరేషన్ లో జూసుయి కౌంటీలో ఉన్న డానింగ్ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి నదిలో పడిపోయిన అయిదు వాహనాల నుంచి 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చైనా మీడియా తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో అదృశ్యమైన మరో 20 వాహనాల ఆచూకీ ఇంకా తెలియలేదు.

Also Read : CM Revanth Reddy : తెలంగాణ‌లో కొత్త ప‌థ‌కం.. వారికి రూ.1,00,000

ఈ ప్రమాదం పట్ల అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దేశంలో వరద ప్రభావం, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల గురించి జిన్ పింగ్ ఆరా తీశారు. అన్నింటిని మానిటర్ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు