Trendy Slippers : కువైట్ స్టోర్‌లో ‘ట్రెండీ స్లిప్పర్స్’ ధర రూ. 1 లక్ష అంట.. మేమైతే టాయిలెట్‌కి వాడతామంటున్న మనోళ్లు..!

Trendy Slippers : ఈ వీడియో కువైట్ ఇన్‌సైడ్, మధ్యప్రాచ్య దేశంలో అప్‌డేట్‌లను అందించే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయింది. ఈ పోస్టుపై స్పందించిన భారతీయ నెటిజన్లు బాత్రూమ్ చెప్పులతో పోలుస్తున్నారు.

Kuwait Store Sells 'Trendy Slippers' For Rs 1 Lakh ( Image Source : Google )

Trendy Slippers : చెప్పుల ధర ఎంత ఉంటుంది? మహా అయితే, రూ. 500 నుంచి రూ. వెయ్యి దాకా ఉంటుంది. ఇంకా ఖరీదు అంటే.. రెండు నుంచి మూడు వేలు ఉండొచ్చు. లేదంటే.. ఇంకా కొద్దిగా ఖరీదు ఉండొచ్చు.. అంతేకానీ, ఏకంగా లక్ష రూపాయలు చెప్పులు ఉండటం చాలా అరుదు.

Read Also : Amazon Prime Day Sale : ఈ నెల 20 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్.. డోంట్ మిస్..!

అదే కువైట్‌లోని ఒక స్టోర్ ట్రెండ్లీ చెప్పులను 4,500 రియాల్స్‌కు విక్రయిస్తోంది. అంటే.. మన భారత కరెన్సీలో అక్షరాలా రూ. లక్ష రూపాయలకు సమానం. ఇప్పుడు, ఈ చెప్పుల ధర భారతీయుల దృష్టిని ఆకర్షించింది. దేశీ నెటిజన్లు చాలా మంది చెప్పుల అధిక ధరపై ఎగతాళి చేస్తున్నారు. సాధారణంగా టాయిలెట్‌కు ధరించే చెప్పుల మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు.

ఈ వీడియో కువైట్ ఇన్‌సైడ్, మధ్యప్రాచ్య దేశానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయింది. ఈ పోస్టుపై స్పందించిన భారతీయ నెటిజన్లు బాత్రూమ్ చెప్పులతో పోలుస్తున్నారు. అంతేకాదు.. సరదాగా చెప్పులపై కామెంట్లు పెడుతున్నారు. మా జీవితమంతా టాయిలెట్ కోసం 4,500 రియాల్ చెప్పులను ఉపయోగిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ పోస్టు చేశాడు.

భారత్‌లో బాత్రూమ్‌కి వీటిని వేసుకుంటాం. మేమైతే మా దేశంలో రూ.60కి కొంటామని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. భారతీయ తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి ఈ చెప్పులను ఉపయోగిస్తారంటూ పలువురు యూజర్లు ఫన్నీగా స్పందించారు.

“ఇది ప్రతి భారతీయ తల్లికి నచ్చిన ఆయుధం” అని మరో యూజర్ కామెంట్ చేశారు. భారతీయులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడ రూ. 100లకు చెప్పులను కొనుగోలు చేసి వాటిని 4,500 రియాల్స్ (1 లక్ష )కి విక్రయించాలి. పెట్టుబడిపై రాబడి 1000x,” అని అర్కబ్రత దాస్ అనే నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ స్లిప్పర్ ధర రూ. 250 అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా.. అంతకంటే ఎక్కువ పెట్టడం వేస్ట్ అంటున్నారు. ఈ స్లిప్పర్‌ను భారత్ నుంచి కువైట్‌కి ఎగుమతి చేసేందుకు నేను రెడీ అంటూ మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. కువైట్‌కు చెందిన ఈ వీడియోను షేర్ చేయగా 30 లక్షల మంది వీక్షించారు. వేలాదిగా కామెంట్లు వచ్చాయి.

Read Also : Moto G85 5G Sale : భారత్‌లో మోటో G85 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు, సేల్ ఆఫర్లు ఇవే!

ట్రెండింగ్ వార్తలు