Iron Burn Design: ఇదెక్కడి ఫ్యాషన్ రా అయ్యా.. కాలిన మరక ఉన్న ఈ షర్ట్ ధర లక్ష రూపాయలట..
ఈ షర్ట్ ధర అక్షరాల లక్ష రూపాయలు అని తెలిసి బిత్తరపోతున్నారు. అసలే కాలిన గుర్తు ఉన్న చొక్కాను ఎవరు కొంటారు అని అనుకుంటే.. దాని ధర లక్ష రూపాయలు అని తెలిసి అంతా నోరెళ్ల బెడుతున్నారు.
Iron Burn Design Representative Image (Image Credit To Original Source)
Iron Burn Design: ఎవరి పిచ్చి వాడికి ఆనందం అంటే ఇదే కాబోలు. ఫ్యాషన్ పేరుతో కొందరు చేస్తున్న పని చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్న నడుస్తున్న ఫ్యాషన్ చూస్తే.. ఇదెక్కడి ఫ్యాషన్ రా అయ్యా అని అనకుండా ఉండలేము. సాధారణంగా మనం వేసుకునే దుస్తులపై ఏదైనా మరక కనిపిస్తే.. ఇక అలాంటి దుస్తులు మనం వేసుకోము. వాటిని వాడాలంటే ఆలోచిస్తాము. ఎవరైనా చూస్తే బాగోదని మొహమాట పడతాం. ఆ దుస్తులు వాడకుండా పక్కన పడేస్తాం. అయితే, ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో జరుగుతోంది. దుస్తులపై మరకను కొత్త ఫ్యాషన్ గా ఫీల్ అయ్యే జనాలు ఉన్నారిప్పుడు. దీనికి నిదర్శనమే ఓ ఫ్యాషన్ బ్రాండ్ ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన తెల్లని షర్ట్.
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ వెట్మెంట్స్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఛాతీ జేబుపై ఐరన్ బర్న్ (కాలిన గుర్తు) ముద్రించిన తెల్ల చొక్కాను అమ్మినందుకు ఆన్లైన్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఐరన్ అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉంచినప్పుడు లేదా దానిపై నొక్కినప్పుడు తరచుగా ఇలాంటి గుర్తులు గుడ్డ ముక్కపై మిగిలిపోతాయే అని విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలంటారు. లేదంటే మరకలు పడిపోయి ఆ షర్ట్ అందమే పోతుంది. అయితే, ఫ్యాషన్ బ్రాండ్ వెట్మెంట్స్ అందుకు భిన్నంగా చేసింది. కాలిన గుర్తు ఉన్న షర్ట్ లను అమ్మకానికి ఉంచింది. అంతేకాదు.. ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్ అని ప్రచారం కూడా చేసుకుంది.
ఫ్యాషన్ పేరుతో అపహాస్యం..
వైట్ ఐరనింగ్ బర్న్ గ్రాఫిక్ షర్ట్ స్టైల్ పేరుతో అమ్మకానికి ఉన్న ఈ చొక్కా భారీ పరిమాణంలో ఉంది. కాలిన గుర్తు షాకింగ్ అనుకుంటే.. దీని ధర తెలిసి మరింత విస్తుపోతున్నారు. ఈ షర్ట్ ధర అక్షరాల లక్ష రూపాయలు అని తెలిసి బిత్తరపోతున్నారు. అసలే కాలిన గుర్తు ఉన్న చొక్కాను ఎవరు కొంటారు అని అనుకుంటే.. దాని ధర లక్ష రూపాయలు అని తెలిసి అంతా నోరెళ్ల బెడుతున్నారు. పైగా ఫ్యాషన్ పేరుతో ఆ కంపెనీ చేస్తున్న ప్రచారానికి ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇదెక్కడి ఫ్యాషన్ రా నాయనా అని విమర్శిస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలే కాలిన గుర్తు ఉన్న చొక్కా, పైగా ధర లక్ష రూపాయలు.. చాలా టూ మచ్ అంటున్నారు.
మీ క్రియేటివిటీ తగలెయ్య అని నెటిజన్లు కసురుకుంటున్నారు. మీ క్రియేటివిటీ రాంగ్ అయ్యింది, అది అచ్చు కాలిన మరకలా ఉంది. చాలా చీప్ గా ఉంది. ఈ షర్ట్ ని ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరూ తీసుకోరు అని కామెంట్స్ చేస్తున్నారు.
లగ్జరీ బ్రాండ్ లు చేస్తున్న పని తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి డిజైన్లు పెట్టి నవ్వుల పాలవడం ఇదేమి తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి. ఫ్యాషన్ పేరుతో మరకలు ఉన్నవి లేదా డ్యామేజ్ అయిన ఉత్పత్తులను ఆన్ లైన్ లో ఉంచి అధిక ధరకు అమ్మడం గతంలోనూ జరిగాయి.
Also Read: పెళ్లిలో దారుణం.. అందరి ముందే పెళ్లి కూతురిని కాల్చిన ప్రియుడు.. వీడియో వైరల్
VETEMENTS made a graphic shirt with an “iron burn” print that retails $1,139 pic.twitter.com/F5e9pkLQ8j
— STAYGROUNDEAD TV (@staygroundeadtv) February 16, 2026
