విశాఖలో వైసీపీని నడిపించేదెవరు? ఎందుకీ పరిస్థితి?
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు కార్యకర్తలు.
Jagan
- పట్టున్న నాయకులు లేకపోవడంతో అంతా గందరగోళం
- పార్టీ టికెట్ ఇచ్చినా చాలామంది గెలిచే అవకాశం లేదన్న టాక్
- స్థానిక ఎన్నికల వేళ లీడర్లు లేకపోవడంతో క్యాడర్లో అయోమయం
YCP: ఘోర పరాభవం తర్వాత విశాఖలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు బలంగా లేకపోవడంతో..క్యాడర్లో జోష్ నింపడం పక్కన పెడితే..జెండా పట్టుకుని నడిచే నాథుడే కరువయ్యాడన్న చర్చ జరుగుతోంది. నడిపించే నాయకులు లేక అంతా గజిబిజి గందరగోళం అన్నట్లుగా ఉందట పరిస్థితి. ఇప్పుడున్న నాయకులు చాలామందికి పార్టీ టికెట్ ఇచ్చినా మళ్లీ గెలిచే సీన్ లేదంటూ టాక్..క్యాడర్‌కు ఆందోళన కలిగిస్తోందట.
రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖలో నాయకులు కావలెను అని బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని..కార్యకర్తల మధన పడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా బలం లేకున్నా వైసీపీ నేతలు ఇక్కడ చక్రం తిప్పారు. అయితే పార్టీ ఘోర ఓటమి తర్వాత..క్యాడర్, లీడర్లలో జోష్ అన్నదే కనిపించట్లేదంటున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో నియోజకవర్గాలకు సారథ్యం వహించే నేతలు లేక వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందట ఫ్యాన్ పార్టీ.
విశాఖలో సౌత్ నియోజకవర్గం తప్ప మరే ఇతర స్థానంలో వైసీపీ సేఫ్‌గా లేదంటున్నారు. విశాఖ సౌత్‌లో వాసుపల్లి గణేష్ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓడినా అక్కడే నిరంతరం పని చేస్తూ వస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన అన్ని స్థానాల్లో లీడర్స్ కొరత ఏర్పడిందట. విశాఖ ఈస్ట్‌లో గత ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేసి ఓడిపోయారు.
Also Read: గుడిసెల కూల్చివేత చుట్టూ రాజకీయ దుమారం..! ఆరోపణలు ఏంటి? వాటిలో నిజమెంత?
మిగిలిన ఈస్ట్, నార్త్, వెస్ట్, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు కాదు కదా, త్వరలో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలను కూడా ఎదుర్కోలేని పొజిషన్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తోందట ఫ్యాన్ పార్టీ. విశాఖ ఈస్ట్‌లో గతంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంచార్జ్‌గా ఉండేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన పొలిటికల్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లారు. ఇక నార్త్‌లో గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన కే కే రాజు ఘోర ఓటమిని చవిచూశారు.
టికెట్ ఇచ్చినా పోటీ చేసి గెలిచే అవకాశం లేదా?
ఇప్పుడు మళ్లీ టికెట్ ఇచ్చినా ఆయన పోటీ చేసి గెలిచే అవకాశం లేదని పార్టీ అధిష్టానం వర్గాలే భావిస్తున్నాయట. ఇక విశాఖ వెస్ట్‌లో ఇంచార్జ్‌గా ఉన్న మళ్ళ విజయ్ ప్రసాద్‌పై చాలా రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిన ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం లేదంటున్నారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఇంచార్జ్‌గా ఉన్నా, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన పోటీ చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఆయన కుమారుడు జనసేనలో చేరిపోయారు. ఇక భీమిలిలో విజయనగరంకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయన మరోసారి పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. గాజువాకలో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడినా అమర్‌కు అక్కడ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. ఇక పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుపై..ప్రజల్లో పాజిటివ్ ఓపీనియన్ లేదన్న ప్రచారం నడుస్తోంది. ఆయన స్థానంలో వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణిని ఇంచార్జ్‌గా నియమించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉందంటున్నారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు కార్యకర్తలు. పటిష్టమైన నాయకత్వం లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయగలమని..పార్టీ గట్టెక్కేదెలా అని క్యాడర్ మధనపడుతున్నారట. అధిష్టానం సీరియస్ ఫోకస్ పెట్టి..అవసరమైత కొత్త నేతలకు ఇంచార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించాలని..ఇలా ఎన్నాళ్లీ గందరగోళం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. విశాఖ వైసీపీ క్యాడర్ మనోవేదనపై ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
