NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య

NBK107: దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఫిబ్రవరి 18న తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతి హాసన్ బాలయ్యకి జోడీగా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

NBK107: కన్నడ మఫ్టీకి రీమేక్ ప్రచారం.. అసలు నిజమేంటి?

దర్శకుడు గోపిచంద్ హంట్ బిగిన్స్ అంటూ ట్వీట్ చేయగా.. షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుండి హీరో బాలయ్య కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి లీకైంది. దీంతో కన్నడ మఫ్టీ సినిమాకి రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. దీనికి ఇది రీమేక్ కాదని కొట్టిపారేసిన మేకర్స్ తాజాగా సోమవారం ఫస్ట్ లుక్ వదిలారు. అందులో బాలయ్య స్టైలిష్ మాసివ్ అవతార్ లో అదరగొట్టాడు.

NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి వచ్చే సినిమా.. క్రాక్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమా.. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దులోని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కే సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ ఎలా ఉండనున్నాయో.. అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో పెంచుతాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు