Bandi Sanjay : కాంగ్రెస్ లో గెలిచినవారు బీఆర్ఎస్ లో చేరుతారు.. 30 సీట్లను డిసైడ్ చేసేది కేసీఆరే : బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి‌ రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.

Bandi Sanjay (10)

Congress And BRS : తాము అధికారంలోకి వస్తే మంచి పథకాలను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ‌సంజయ్ పేర్కొన్నారు. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తామని చెప్పారు. ధరణి మంచి స్కీం కానీ, కేసీఅర్ కుటుంబానికి అసరాగా‌ మారిందని తెలిపారు. కాంగ్రెస్ లో గెలిచిన వారు బీఆర్ఎస్ లో చేరుతారని వెల్లడించారు. కాంగ్రెస్ లో ముప్పై సీట్లను డిసైడ్ చేసేది కేసీఆరేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీపై గెలిచిదే బీజేపీయేనని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి‌ రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ని హామీలు ఇచ్చారు? ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రెండు నెలల నుండి పింఛన్ లు‌ ఇవ్వడం లేదని వెల్లడించారు. అభివృద్ధి నిధులపై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.

Hyderabad Old City : హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం

మహమూద్ అలీ ఉగ్రవాదులు వచ్చినప్పుడు స్పందించలేదన్నారు. హోం మంత్రి అన్న సంగతి మహమూద్ అలీకి తెలియదని ఎద్దేవా చేశారు. హిందూ మహిళ పుస్తెలతాడులు, బొట్లు తీసివేసినప్పుడు హోం మినిస్టర్ ఎక్కడికి పొయారని ప్రశ్నించారు. ఇది హిందూ మహిళలని హేళన చెయడం కాదా? అని నిలదీశారు. మహమూద్ అలీ ఎవరికి హోం మినిస్టర్ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడే పార్టీ కాదని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఫలితాలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రాబోదుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వస్తానని కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసుకున్న సర్వేలో ఆ పార్టీకి నలబై సీట్లు రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని కేసీఅర్ లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ హైదరాబాద్ కు వస్తే కేసీఅర్ వణుకు పుడుతుందన్నారు. బీజేపీ పార్టీ నుండి ఎవరూ బయటికి పోరని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు