Bandla Ganesh: పవన్ పార్టీలో చిరు.. మరి నేను అంటోన్న బండ్ల గణేష్!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బండ్ల గణేష్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.....

Bandla Ganesh: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బండ్ల గణేష్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కాగా బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అనేకసార్లు ఆయన బహిరంగంగా తెలియజేశాడు. కాగా పలు ఇంటర్వ్యూల్లోనూ పవన్‌పై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు ఈ నిర్మాత. అయితే గతంలో ఆయన రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంట్రీ ఇచ్చి, ఓటమి పాలవడంతో అటుపై రాజకీయాల నుండి నిష్క్రమించారు. ఇక తాజాగా మరోసారి ఆయన రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్

తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ద్వారా ఈ విషయం అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, దానికి రిప్లైగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలోకి రావాలని.. ఆయన పార్టీలోకి వచ్చి అధికారం తేవాలని కోరాడు. మెగాస్టార్ స్టామినా ఏమిటో చూపించాలని.. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలని.. రాముడులోని సౌమ్యం చిరంజీవి అని.. లక్ష్మణుడిలోని తెగింపు పవన్ కళ్యాణ్‌ది అని.. వీరిద్దరు కలిస్తే శ్రీరామరాజ్యం అవుతుంది.. అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను జనసైనికులు, పవన్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Bandla Ganesh: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. నేనొస్తున్నానంటున్న బండ్ల

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కూడా తనదైన స్టయిల్‌లో ఈ కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు. ‘‘మరి నేను..?’’ అంటూ బండ్ల చేసిన కామెంట్‌కు జనసైనికులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలకు దూరంగా ఉండటమే ఉత్తమమని.. తనకు రాజకీయాలు సరిపోవని గతంలో బండ్ల గణేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా జనసేన పార్టీకి సంబంధించిన పోస్టుపై బండ్ల ట్వీట్ చేయడంతో, పవన్ పార్టీలోకి వెళ్లేందుకు బండ్ల రెడీగా ఉన్నాడా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. మరి ఈ విషయంపై బండ్ల గణేష్ ఏదైనా క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు