BJP: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీజేపీకే మెజారిటీ

రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.

BJP: ఒకవైపు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగానే, ఉప రాష్ట్రపతి ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఆగష్టు 6న ఈ ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగష్టు 10తో పూర్తవుతుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఇంకా ప్రకటించలేదు. కానీ, పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ ఎన్డీయే తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ తరఫున పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే, ఆ పార్టీకి రాజీనామా చేసి ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే పార్టీని స్థాపించారు.

Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష

ఇక ప్రతిపక్షాల అభ్యర్థి విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీకే మెజారిటీ ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది. ఇది రాష్ట్రపతి ఎన్నికలా కాదు. దీనికి పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. ఆ లెక్కన పార్లమెంటులో బీజేపీకి మెజారిటీ ఉంది. లోక్‌సభ, రాజ్యసభ కలిపి పార్లమెంటులో మొత్తం 775 మంది సభ్యులున్నారు. అంటే మొత్తం ఓటర్లు 775. ఈ ఎన్నికల్లో గెలవాలంటే 388 ఓట్ల మెజారిటీ అవసరం. ప్రస్తుతం బీజేపీకి అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఓట్లున్నాయి. రాజ్యసభలో బీజేపీకి రెండేళ్లలో ముగ్గురు సభ్యులు (మూడు ఓట్లు) తగ్గారు. అయినప్పటికీ 92 మంది సభ్యులున్నారు. అలాగే లోక్‌సభలో 303 మంది సభ్యులున్నారు.

Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

లోక్‌సభ, రాజ్యసభ కలిపి బీజేపీకి మొత్తం 395 మంది సభ్యుల మద్దతు ఉంది. అంటే మెజారిటీకంటే ఏడు ఓట్లు ఎక్కువగానే బీజేపీకి ఉన్నాయి. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ ఏకపక్షంగా గెలిచే అవకాశాలున్నాయి. పోటీ జరిగినా బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19న ముగుస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికొస్తే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 42 శాతం మాత్రమే ఓట్లున్నాయి. కానీ, ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ, పంజాబ్‌లోని అకాళీ దళ్ వంటి పార్టీలు మద్దతు ఇస్తుండటంతో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.

ట్రెండింగ్ వార్తలు