హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పుల్లేవ్: అధికారులు

Hyderabad Metro Rail: ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై..

Hyderabad-Metro-Rail

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులూ లేవని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మెట్రో రైళ్లు ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య నడుస్తాయని తెలిపారు. ఇక ప్రతిరోజు 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుందన్న ప్రచారాన్నీ వారు ఖండించారు.

ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం అవుతాయన్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఈ వేళలను అమల్లోకి తీసుకురాలేదని తెలిపారు. తాము ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలపై పరిశీలన చేశామని అన్నారు.

దానిపై ఎటువంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై పరిశీలన మాత్రమే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులు అనవసర గందరగోళానికి గురి కావద్దని చెప్పారు.

ట్రాఫిక్ జామ్, ఎండలు, వానల వంటి వాటి నుంచి తప్పించుకుని గమ్యస్థానాలకు చేరడానికి చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులకు మెట్రో ఒక్కటే ప్రయాణికులకు పరిష్కార మార్గంగా కనపడుతోంది. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

Also Read: పాస్ కావద్దు అంతే.. బిల్లుకు సంబంధించిన పత్రాలను పట్టుకుని పార్లమెంటు నుంచి ఎంపీ పరుగులు