బాలీవుడ్ బడా రీమేక్స్.. ఈజీ సక్సెస్ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్..

  • Updated On - December 4, 2020 / 09:53 PM IST

Bollywood Remakes: సినిమా హిట్ అయ్యి ట్రెండ్ సెట్ చేసిందంటే చాలు.. అదే కాంబినేషన్‌ని రిపీట్ చేసి సీక్వెల్‌తో హిట్ కొట్టేస్తున్నారు హీరోలు. సక్సెస్‌కి సింపుల్ వే గా కనిపిస్తున్న ఈ సీక్వెల్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్పీడప్ అయ్యాయి. అన్నీ ఒక ఎత్తు.. బాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ఖల్‌నాయక్’ రీమేక్ చెయ్యడం ఒక ఎత్తు. మరి ఈ ఎవర్‌గ్రీన్ సినిమా సీక్వెల్ కబుర్లేంటో చూద్దాం.

ఖల్‌ నాయక్
1993 లో బాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ‘ఖల్‌ నాయక్’ కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరగుతోంది. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్, రమ్యకృష్ణ లీడ్ రోల్స్‌లో సుభాయ్ ఘాయ్ డైరెక్షన్లో తెరకెక్కిన వైర్సెటైల్ మూవీ ‘ఖల్‌ నాయక్’ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సంజయ్ దత్ చేసిన యాంటీ రోల్ టైగర్ ష్రాఫ్ చెయ్యబోతున్నాడు. సంజయ్, మాధురీ గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. కథ డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారు.


‘టైగర్’ సిరీస్
నార్త్‌లో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్టింగ్ సీక్వెల్ సల్మాన్ ఖాన్ ‘టైగర్’ సిరీస్. సల్లూ భాయ్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇస్తాన్‌బుల్, అమెరికా వంటి ప్రదేశాల్లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. ‘టైగర్’ సీక్వెల్ ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకెళ్లబోతోంది.

సూపర్ హీరో సీక్వెల్
హృతిక్ రోషన్ సూపర్ హీరో క్యారెక్టర్‌లో బాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ‘క్రిష్’. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్షన్‌లోనే తెరకెక్కబోతున్న ‘క్రిష్ 4’ ని భారీ బడ్జెట్‌తో జనవరి 2021 నాటికి షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘క్రిష్ 4’ సినిమాకి మెయిన్ ఎలివేషన్ అయిన విజువల్ ఎఫెక్ట్స్‌ని షారూఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్ చేస్తోంది.


మరో సారి ‘వార్’ కి రెడీ
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ‘వార్’ సినిమాకి కూడా సీక్వెల్ తెరకెక్కబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నెక్ట్స్ ఇయర్ సమ్మర్ తర్వాత సీక్వెల్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే షారూఖ్ ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న ఆనంద్‌తోనా, లేక కొత్త డైరెక్టర్‌తోనా అనే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు యష్ రాజ్ ఫిల్మ్స్.


టైగర్ ష్రాఫ్ రెండు రీమేక్‌లు
సీక్వెల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. ఈ మస్క్యులర్ హీరో 2 సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిందీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చిన ‘భాగీ 4’ తో పాటు లవర్ బాయ్‌గా గుర్తింపు తీసుకొచ్చిన ‘హీరోపంతి 2’ ఇలా రెండు సీక్వెల్ సినిమాలకు రెడీ అవుతున్నాడు టైగర్.

ఇవి కూడా
ఈ హీరోలే కాకుండా.. అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్ నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భూల్ భులయ్యా’ కు సీక్వెల్ చేస్తున్నారు. వీటితో పాటు వరుస యాక్షన్ మూవీస్‌తో అమేజింగ్ మార్షల్స్ ఆర్ట్స్‌తో ఆడియెన్స్‌ని సర్‌‌ప్రైజ్ చేసిన విద్యుత్ జమ్వాల్.. ‘కమాండో’ సిరీస్‌కి మరో సీక్వెల్ చేస్తున్నారు. ఇలా బాలీవుడ్‌లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా సీక్వెల్స్ చేస్తూ.. ఈజీ సక్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు.