IPL 2024 : సెంచరీతో బెయిర్‌స్టో విజృంభణ.. పంజాబ్ దెబ్బకు కోల్‌కతా ఖేల్ ఖతం.. ఉఫ్ అని ఊదేసింది..!
కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
- Sreehari A
- Updated on- April 27, 2024 / 12:01 AM IST
IPL 2024 _ PBKS beats KKR by 8 wickets
IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ (54; 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో (108; 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు.
శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్)తో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. రిలీ రోసోవ్ (26) పరుగులతో పర్వాలేదనిపించాడు. దాంతో 18.4 ఓవర్లలో ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 262 పరుగులను ఆడుతూ పాడుతూ ఛేదించింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెయిర్ స్టోకు (108/48) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
హాఫ్ సెంచరీలతో మెరిసిన సునీల్ నరైన్, సాల్ట్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (75), సునీల్ నరైన్ (71) హాఫ్ సెంచరీలతో హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్లుగా నిలవగా, వెంకటేష్ అయ్యర్ (39), ఆండ్రీ రెస్సెల్ (24), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (28) పరుగులకే పరిమితమయ్యారు.
మిగతా ఆటగాళ్లలో రింకూ సింగ్ (5), రమణదీప్ సింగ్ (6 నాటౌట్) పరుగులతో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, సామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసుకున్నారు.
టాప్ 2లోనే కోల్‌కతా :
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 3 ఓడి 10 పాయింట్లతో టాప్ 2లో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 ఓడి 6 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.
Read Also : Krunal Pandya : మరోసారి తండ్రైన కృనాల్ పాండ్య
